Saudi Arabia లో సుభాన్ బేక‌రీ. హైద‌రాబాద్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. రుచిక‌ర‌మైన ఉస్మానియా బిస్కెట్లు, Dam ke Roat కు కేరాఫ్ అడ్ర‌స్. నిజాం కాలంలో మొద‌లైన సుభాన్ బేక‌రీ ప్ర‌స్థానం అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పుడు స‌రిహ‌ద్దులు దాటి సౌదీ అరేబియాలోనూ అమోఘ‌మైన రుచుల‌ను పంచుతోంది. ఆ దేశ రాజ‌ధాని రియాద్ లో సుభాన్ బేక‌రీ అందుబాటులోకి తెచ్చిన first international venture కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

Saudi Arabia లో సుభాన్ బేక‌రీ హ‌లీం రుచి అద‌ర‌హో:

ఇది రంజాన్ మాసం. ఈ సీజ‌న్ లో ఠ‌క్కున గుర్తొచ్చేది హ‌లీం. సుభాన్ బేక‌రీ అందిస్తున్న హ‌లీం అక్క‌డి వారికి ఫేవ‌రెట్ గా మారింది. అర‌బ్బుల‌తో పాటు రియాద్ లో నివ‌సించే భార‌తీయులు దాని టేస్ట్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పడా హ‌లీం అక్క‌డ సెన్సేష‌న్ గా మారింది. ప్ర‌జ‌ల మ‌న‌సు దోచేస్తోంది.Subhan Bakery

Hara Regionకు స‌మీపంలోని Al Murabba Road లో సుభాన్ బేక‌రీని ఏర్పాటు చేశారు. అక్క‌డి వారితో పాటు స్థానికంగా ప‌ని చేసే ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వ‌ర్క‌ర్లు ఇక్క‌డికి క్యూ క‌డుతున్నారు. శ‌తాబ్దానికి పైగా సుభాన్ బేక‌రీ Traditional Indian Delightsకు చిరునామాగా నిలుస్తోంది. ఇందులో దొరికే ప్ర‌తీది నోరూరిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు.

Poultary

సౌదీ అరేబియాలో సుభాన్ బేక‌రీ ఏర్పాటు నిర్ణ‌యాన్ని యాజ‌మాన్యం స‌డెన్ గా తీసుకోలేదు. ఆ బేక‌రీ ఉత్ప‌త్తుల‌కు సౌదీలో చాలా రోజులుగా ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ యూనిట్ ను ప్రారంభించాల‌ని సుభాన్ బేక‌రీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. అనుకున్న విధంగానే తొలి రోజు నుంచే జ‌నం విశేషంగా ఆద‌రిస్తున్నారు.

దీంతో, బేక‌రీ ప్రాంత‌మంతా కిట‌కిట‌లాడుతోంది. భారీ క్యూ లైన్ల‌లో జ‌నం నిల్చుంటున్నారు. త‌మ వంతు కోసం ఎదురు చూస్తూ హ‌లీం రుచుల‌ను ఆస్వాదిస్తున్నారు. ఒక్కో హ‌లీం బాక్సు 15 సౌదీ రియాల్ కు విక్ర‌యిస్తున్నారు.

ఇంట‌ర్నేష‌న‌ల్ ఎంట్రీతో సుభాన్ బేక‌రీ ఒక చారిత్ర‌క మైలురాయిని అధిగ‌మించింది. 130 ఏళ్ల సుభాన్ బేక‌రీ చ‌రిత్ర‌లో ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. రుచి, ప‌రిమ‌ళం, నాణ్య‌త ఇవ‌న్నీ మిళిత‌మైన సుభాన్ బేక‌రీ ఉత్ప‌త్తులు ప్ర‌జ‌ల మ‌న‌సుదోచేస్తున్నాయి. ఈ విశిష్ట‌త‌ల‌ను సుభాన్ బేక‌రీ అలాగే కొన‌సాగించాల‌ని.. రాబోయే రోజుల్లో మ‌రింత‌గా విస్త‌రించాల‌ని కోరుకుందాం.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement