Roshni Nadar: HCL Technologies chairperson Roshni Nadar Malhotraకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఫ్రాన్స్ అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన Knight of the Legion of Honour ఆమెను వ‌రించింది. France Ambassador Thierry Mathou చేతుల మీదుగా Roshni ఈ అవార్డును స్వీక‌రించారు. business & sustainabilityలో చేసిన contributionsకు గానూ ఈ గుర్తింపు ల‌భించింది. దీనిప‌ట్ల ఆమె సంతోషం వ్య‌క్తం చేశారు. భార‌త్, ఫ్రాన్స్ మ‌ధ్య ఉన్న strategic relationshipకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. ఫ్రాన్స్ లో త‌మ కంపెనీ చాలా కాలంగా కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తోంద‌ని.. అక్క‌డి వ్యాపారాల digital transformation కోసం త‌మ స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని Roshni వెల్ల‌డించారు.

Roshni Nadar
Roshni Nadar

Microsoft: వ‌ర‌ల్డ్ లో టాప్ ఐటీ కంపెనీగా పేరుపొందిన Microsoft సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. చైనాలోని త‌మ ఆఫీసుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడొద్ద‌ని ఉద్యోగుల‌కు సూచించింది. వాటి ప్లేస్ లో ఐ ఫోన్ల‌ను మాత్ర‌మే యూజ్ చేయాల‌ని చెప్పింది. వ‌ర్క్ కోసం ఉప‌యోగించే ఫోన్ల‌న్నీ అవే అయి ఉండాల‌ని స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణ‌ముంది. చైనాలో Google, Google Play Store సేవ‌లు అందుబాటులో లేవు. వాటికి బ‌దులుగా ఆ దేశం త‌మ సొంత ప్లాట్ ఫామ్స్ ఉప‌యోగిస్తుంది. ఈ ప‌రిస్థితుల్లో ఆండ్రాయిడ్ డివైజ్ లు వాడ‌టం వ‌ల్ల డేటాకు ముప్పు పొంచి ఉంద‌ని భావించిన Microsoft ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు.. చైనాలో ప‌నిచేసే ఉద్యోగుల‌కు iOS-based devicesను అందుబాటులో ఉంచ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Microsoft
Microsoft

Xiaomi: Chinese consumer electronics దిగ్గ‌జం Xiaomi భార‌త్ లో ప్ర‌వేశించి ప‌దేళ్లు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ఆ కంపెనీ మ‌రో టార్గెట్ పెట్టుకుంది. 2034 నాటికి 70 crore device shipments త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపింది. అలాగే రాబోయే రోజుల్లో 10 వేల నుంచి 15 వేల రూపాయ‌ల రేంజ్ లో ఉన్న మ‌రిన్ని స్మార్ట్ ఫోన్ల‌ను అందుబాటులోకి తెస్తామ‌ని వెల్ల‌డించింది. కాగా, గ‌త ప‌దేళ్ల‌లో Xiaomi భార‌త్ లో 35 కోట్ల‌కు పైగా devicesను విక్ర‌యించింది. వాటిలో 25 కోట్ల‌కు పైగా స్మార్ట్ ఫోన్స్ ఉండ‌టం విశేషం.

Poultary
Xiaomi india
Xiaomi india

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్ లో మ‌రోసారి స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఉద‌యం సెన్సెక్స్ 80,107.21 పాయింట్ల ద‌గ్గ‌ర మొద‌లైంది. రోజంతా లాభాల బాట‌లో ప‌య‌నించింది. చివ‌రికి 80,351.64 ద‌గ్గ‌ర క్లోజ‌యింది. నిఫ్టీ 24,433.20 ద‌గ్గ‌ర ముగిసింది. టాటా స్టీల్స్, కొట‌క్ మ‌హీంద్రా, రిల‌యన్స్, మ‌హీంద్రా & మ‌హీంద్రా, మారుతీ సుజుకీ త‌దిత‌ర షేర్లు లాభ‌ప‌డ్డాయి.

Stock Market
Stock Market
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here