వానాకాలం మొద‌లైంది. నైరుతి ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. (Rainy Season Alert) హైద‌రాబాద్, సికింద్రాబాద్ లోనూ వాన‌లు ప‌డుతున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రిన్ని వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది. (Rainy Season Alert)

నేప‌థ్యంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలూ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసేలా ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

వర్షాకాలం మొద‌లైన‌ నేప‌థ్యంలో జీహెచ్ ఎంసీ ప‌రిధిలో డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ తో పాటు తీసుకోవాల్సిన‌ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష జ‌రిపారు.

Poultary
  • క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ సంద‌ర్శ‌న‌..:

రివ్యూలో భాగంగా హైద‌రాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్య‌మంత్రి సందర్శించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త త‌దిత‌రులు సీఎం వెంట ఉన్నారు.

  • ఎఫ్.ఎం రేడియో ద్వారా అల‌ర్ట్స్…:

వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్ మెంట్ ను ఇంటిగ్రేట్ చేయాల‌ని చెప్పారు.

ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలను వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.

జంట‌న‌గ‌రాల్లో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఎఫ్‌.ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

  • మ‌రిన్ని సూచ‌న‌లు..:

ఈ సీజన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై రేవంత్ రెడ్డి సూచ‌న‌లు చేశారు.

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానాన్ని అనుసరించాలని చెప్పారు. సిబ్బంది కొరత ఉంటే హోమ్ గార్డులను రిక్రూట్‌ చేసుకోవాలని అన్నారు.

జంట‌న‌గ‌రాల్లో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు తెలియ‌జేశారు.

దీంతో, వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్య‌మంత్రి తెలిపారు.

అలాగే నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద వెళ్లేలా వాటర్ హార్వెస్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

 

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here