కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ కూర్పు కూడా జరిగింది. (Modi 3.0 Cabinet) కేబినెట్ ర్యాంకుతో పాటు సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), ఇతర సహాయ మంత్రులు కలిపి 71 మందికి మోడీ టీంలో చోటు దక్కింది. (Modi 3.0 Cabinet)
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు..:
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మంత్రి వర్గంలో స్థానం లభించింది. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పౌర విమానయాన శాఖ (కేబినెట్ హోదా) బాధ్యతలు అప్పగించారు. టీడీపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ (సహాయ మంత్రి), బీజేపీకి చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ మంత్రి) శాఖలు కేటాయించారు.
ఇక, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి హోం శాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు.
కీలక శాఖల్లో మార్పు లేదు..:
పాత కేబినెట్ లో మినిస్టర్స్ గా పనిచేసిన వారిలో కొందరికి ఈ సారి అదనపు శాఖలు దక్కాయి. మరికొందరికి ఆయా శాఖల్లో కోత విధించారు.
ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ శాఖల్లో ఎలాంటి మార్పులు జరుగలేదు. ఆయా రంగాలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన నిర్మలా సీతారామన్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్ లనే కొత్త కేబినెట్ లోనూ కొనసాగించారు.
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ.. సిబ్బంది వ్యవహారాలు, పింఛన్లు, ప్రజా ఫిర్యాదుల శాఖలను పర్యవేక్షిస్తారు. అలాగే అణుశక్తి, అంతరిక్షం, కీలక విధాన సంబంధిత అంశాలతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను చూస్తారు.
Modi 3.0 30 మంది కేబినెట్ మంత్రులు:
1. రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ శాఖ
2. అమిత్‌షా – హోం , సహకార శాఖ
3. నితిన్ గడ్కరీ – రోడ్డు రవాణా, జాతీయ రహదారులు
4. జేపీ నడ్డా – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం; రసాయనాలు, ఎరువులు
5. శివరాజ్ చౌహాన్ – వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి
6. నిర్మలా సీతారామన్ – ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు
7. జై శంకర్ – విదేశాంగ వ్యవహారాలు
8. ఖట్టర్ – గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి; విద్యుత్తు
9. కుమారస్వామి – భారీ పరిశ్రమలు, ఉక్కు
10. పీయూశ్ గోయల్ – వాణిజ్యం, పరిశ్రమలు
11. ధర్మేంద్ర ప్రధాన్ – విద్యా శాఖ
12. మాంఝీ – సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
13. లలన్ సింగ్ – పంచాయతీ రాజ్,మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ
14. శర్బానంద సోనోవాల్ – పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్
15. రామ్మోహన్ నాయుడు – పౌర విమానయానం
16. డాక్టర్ వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత
17. జుయెల్ ఓరమ్ – గిరిజన వ్యవహారాలు
18. ప్రహ్లాద్ జోషి – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
19. అశ్విని వైష్ణవ్ – రైల్వే, సమాచార ప్రసార శాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్
20. గిరిరాజ్ సింగ్ – జౌళీ పరిశ్రమ
21. జ్యోతిరాదిత్య సింధియా – టెలికాం, కమ్యూనికేషన్స్
22. భూపేంద్ర యాదవ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
23. గజేంద్ర సింగ్ షెకావత్ – సాంస్కృతికం, పర్యాటకం
24. అన్నపూర్ణ దేవి – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
25. కిరణ్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాలు,మైనార్టీ వ్యవహారాలు
26. మన్షుఖ్ మాండవీయ – కార్మిక, ఉపాధి శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడలు
27. హర్దీప్ సింగ్ పురీ – పెట్రోలియం, సహజ వాయువు
28. కిషన్ రెడ్డి – బొగ్గు, గనులు
29. చిరాగ్ పాశ్వాన్ – ఆహార శుద్ధి పరిశ్రమలు
30. సీఆర్ పాటిల్ – జల్‌శక్తి
ఐదుగురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)..:
- రావ్ ఇందర్‌జిత్ సింగ్ – గణాంకాలు, కార్యక్రమాల అమలు, ప్లానింగ్జి
- తేంద్ర సింగ్ – సైన్స్ అండ్ టెక్నాలజీ, అణుశక్తి
- అర్జున్ రామ్ మేఘ్ వాల్ – న్యాయ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాలు
- ప్రతాప్ రావ్ గణ్ పత్ రావ్ – ఆయుష్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
- జయంత్ చౌదరి – నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్ షిప్, విద్య
36 మంది సహాయ మంత్రులు..:
- జితిన్ ప్రసాద – వాణిజ్యం, పరిశ్రమలు
- శ్రీపాద యశో నాయక్ – విద్యుత్, పునరుత్పాదక ఇంధనం
- పంకజ్ చౌదరి – ఆర్థికం
- క్రిషన్ పాల్ – సహకార శాఖ
- రామ్ దాస్ అథవాలే – సామాజిక న్యాయం, సాధికారత
- రామ్ నాథ్ ఠాకూర్ – వ్యవసాయం, రైతు సంక్షేమం
- నిత్యానంద్ రాయ్ – హోం శాఖ
- అనుప్రియా పటేల్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
- వి. సోమన్న – జల్ శక్తి, రైల్వే
- పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
- ఎస్పీ సింగ్ బఘేల్ – మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ
- శోభా కరంద్లాజే – సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
- కీర్తివర్ధన్ సింగ్ – పర్యావరణం, అటవీ, విదేశాంగ, వాతావరణ మార్పులు
- బీఎల్ వర్మ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
- శాంతను ఠాకూర్ – పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్
- సురేశ్ గోపి – పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటకం
- ఎల్ మురుగన్ – సమాచార, ప్రసార శాఖ
- అజయ్ తమ్టా – రోడ్డు రవాణా, జాతీయ రహదారులు
- బండి సంజయ్ కుమార్ – హోం శాఖ
- కమలేశ్ పాశ్వాన్ – గ్రామీణాభివృద్ధి
- భగీరథ్ చౌదరి – వ్యవసాయం, రైతు సంక్షేమం
- సతీశ్ చంద్ర దూబే – బొగ్గు, గనులు
- సంజయ్ సేథ్ – రక్షణ
- రవ్‌నీత్ సింగ్ – ఆహార శుద్ధి పరిశ్రమలు, రైల్వే
- దుర్గాదాస్ ఉయికే – గిరిజన వ్యవహారాలు
- రక్షా నిఖిల్ ఖడ్సే – యువజన వ్యవహారాలు, క్రీడలు
- సుకాంత మజుందార్ – విద్య, ఈశాన్య రీజియన్ అభివృద్ధి
- సావిత్రి ఠాకూర్ – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
- తోఖన్ సాహు – గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి
- రాజ్ భూషణ్ చౌదరి – జల్‌శక్తి
- భూపతిరాజు శ్రీనివాస వర్మ – భారీ పరిశ్రమలు; ఉక్కు
- హరీశ్ మల్హోత్రా – కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, హైవేలు
- నిముబెన్ జయంతీభాయ్ బంభానియా – వినియోగదారు వ్యవహారాలు, ఆహారం
- మురళీధర్ మొహోల్ – సహకారం, పౌర విమానయానం
- జార్జి కురియన్ – మైనార్టీ వ్యవహారాలు, మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ
- పబిత్ర మార్గరీటా – విదేశీ వ్యవహారాలు, జౌళి పరిశ్రమ