Mega DSC: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ఏపీలో మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, సామాజిక ఫించన్ల పెంపునకు సంబంధించిన ఫైళ్లపై సైన్ చేశారు.
TS LAW CET Results: తెలంగాణలో LAWCET, PGLCET ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ వీటిని రిలీజ్ చేశారు.
లాసెట్, పీజీఎల్‌సెట్ కు కలిపి 20,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 29,258 మంది అర్హత సాధించారు.
లాసెట్ ఫలితాల్లో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. https://lawcet.tsche.ac.in ద్వారా రిజల్ట్స్ చూసుకోవచ్చు.
JanaSena: కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో జనసేన మంత్రులకు కీలక శాఖలు దక్కే అవకాశముంది.
పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది. నాదెండ్ల మనోహన్ కు సివిల్ సప్లైస్ శాఖ ఇస్తారని సమాచారం.
కందుల దుర్గేశ్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. తిరుపతిలో ఉన్న చంద్రబాబు అమరావతికి తిరిగి వచ్చాక..
మంత్రులకు శాఖల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఎస్‌ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
ఆ SSMB 29 ప్రాజెక్ట్ కు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా కోసం జక్కన్న రెండు పుస్తకాలను రెఫరెన్స్ గా తీసుకుంటున్నారని టాక్.
ఆఫ్రికన్ రైటర్ విల్బర్ స్మిత్ రాసిన The Triumph of the sun, king of kings పుస్తకాల రైట్స్ ను రాజమౌళి కొనుగోలు చేశారట. ఇప్పుడా వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Wimbledon: Wimbledon టోర్నమెంట్ ప్రైజ్ మనీని భారీగా పెంచారు. అది ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 50 మిలియన్ల పౌండ్లకు చేరింది.
అంటే మన కరెన్సీలో దాదాపు 534 కోట్ల రూపాయలు. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ ఈ విషయాన్ని ప్రకటించింది.
గత ఏడాదితో పోలిస్తే ఇది 11.9 శాతం ఎక్కువ కావడం విశేషం. జూలై 1 నుంచి 14వ తేదీ వరకు లండన్ లో ఈ మెగా టోర్నీ జరుగనుంది.