Kurnool Gold Field
Kurnool Gold Field

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని జొన్న‌గిరి. ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. ఎక్క‌డ చూసినా ఆ మాటే వినిపిస్తోంది. కేజీఎఫ్ సినిమా త‌ర‌హాలో.. జొన్న‌గిరిలో భారీగా బంగారం నిక్షేపాలు వెలుగుచూడ‌ట‌మే అందుకు కార‌ణం. (Kurnool Gold Field)

అక్క‌డి ఎర్ర నేల‌ల్లో ఈ పుత్త‌డి గ‌ని బ‌య‌ట‌ప‌డింది. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆ మైన్ ను అభివృద్ధి చేస్తోంది.

అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ ఏడాది చివ‌రిక‌ల్లా జొన్న‌గిరి గ‌నిలో బంగారం ఉత్ప‌త్తి మొద‌ల‌వుతుంది. మ‌న దేశంలో ప్రైవేట్ రంగంలో తొలి, అతిపెద్ద గోల్డ్ మైన్ ఇదే కావ‌డం విశేషం.

Poultary

Kurnool Gold Field ఎన్ని ఎక‌రాల్లో ఉంది?:

జొన్న‌గిరి బంగారు గ‌ని క‌ర్నూలు జిల్లా తుగ్గ‌లి మండ‌లంలో ఉంది. ఎన్నో ఏళ్ల అన్వేష‌ణ త‌ర్వాత ఇక్క‌డ‌ 1500 ఎక‌రాల్లో బంగారు నిక్షేపాలు ఉన్న‌ట్టు గుర్తించారు.

అనంత‌రం.. ఈ ప్రాంతంలో త‌వ్వ‌కాలు జ‌రిపేందుకు జెమైసోర్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్ సంస్థ.. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకుంది. ఇప్ప‌టికే 250 ఎక‌రాల‌కు పైగా భూమిని సేక‌రించింది.

ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా మొద‌లుపెట్టింది. ఆ ప‌నులు దాదాపు 60 శాతం పూర్త‌య్యాయి. 2024 చివ‌రి నాటికి జొన్న‌గిరి బంగారు గ‌నిలో పూర్తి స్థాయిలో ప‌నులు మొద‌ల‌వుతాయ‌ని భావిస్తున్నారు.

ప్లాంట్ లో కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మైతే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్ప‌త్తి చేసే అవ‌కాశ‌ముంటుంది. మైనింగ్ బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షిస్తున్న దక్కన్‌ గోల్డ్‌ మైన్స్ ఈ గ‌నిపై ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 200 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పెట్టింది.

మ‌రోవైపు, ఏపీలోని చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లోనూ కొన్ని బంగారు గ‌నుల‌ను గుర్తించారు. వాటిని డెవ‌ల‌ప్ చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

గోల్డ్ మైన్స్ లో త‌వ్వ‌కాలు జ‌రిపేందుకు ఎన్.ఎం.డి.సి లిమిటెడ్ ఆస‌క్తి చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని ఏపీ స‌ర్కారు దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.

జొన్న‌గిరి బంగారు గ‌నితో పాటు చిత్తూరు, అనంత‌పురంలో గోల్డ్ మైన్స్ అభివృద్ధి జ‌రిగితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మ‌రింత గుర్తింపు వ‌స్తుంది. ఆ రాష్ట్రం ఆర్థికంగా బ‌లోపేతం అయ్యేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంది.

- పి. వంశీకృష్ణ‌
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here