T Square at Knowledge City: మీకు న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ తెలుసు క‌దా..! ఇప్పుడు అలాంటి భారీ బిల్డింగ్ హైద‌రాబాద్ లోనూ ఏర్పాటు కాబోతోంది. రాయ‌దుర్గంలోని నాలెడ్జ్ సిటీకి స‌మీపంలో ఈ T Squareను నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. Telangana Industrial Infrastructure Corporation ఆధ్వ‌ర్యంలో క‌న్ స్ట్ర‌క్ష‌న్ జ‌రుగ‌నుంది. ఆ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌వుతున్నాయి. T Square నిర్మాణానికి సంబంధించి టీజీఐఐసీ టెండ‌ర్లు ఆహ్వానించింది. మ‌ధ్య‌, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంతో పాటు, ప్ర‌జ‌ల‌కు ఆహ్లాదాన్ని క‌లిగించేలా దీన్ని నిర్మాణం ఉండ‌బోతోంది.

Filmfare Awards: 68వ Filmfare Awardsలో RRR సినిమా స‌త్తా చాటింది. ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేట‌గిరితో పాటు మొత్తం 8 అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది. ఉత్తమ నటి పుర‌స్కారం మృణాళ్‌ ఠాకూర్ ను వ‌రించింది. ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌), ఉత్తమ సాహిత్యం, ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) క‌లిపి మొత్తం 5 అవార్డులు సీతారామం చిత్రానికి ల‌భించాయి. వీరితో పాటుగా South Indian film industryలో మ‌రికొంత మందికి ఫిల్మ్ ఫేర్ అవార్డులు ద‌క్కాయి.

Anant Ambani-Radhika Merchant wedding: Anant Ambani, Radhika Merchant వివాహానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. గ‌త ఏడు నెలలుగా వారి పెళ్లి తంతు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇవాళ అనంత్, రాధికా పెళ్లి బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్‌ అత్యంత ఘనంగా వారి పెళ్లి జరుగ‌నుంది. ఈ వేడుక‌కు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు హాజ‌ర‌వుతున్నారు. దీంతో జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్ సంద‌డిగా మారింది.

Poultary

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మ‌రోసారి అద‌ర‌గొట్టాయి. శుక్ర‌వారం గ‌రిష్ట లాభాల‌తో ముగిశాయి. BSE SENSEX ఇంట్రాడే ట్రేడింగ్ లో దాదాపు 1000 పాయింట్లు పుంజుకుని 80,893.5 ద‌గ్గ‌ర క్లోజ‌యింది. NSE NIFTY 24,592 పాయింట్లకు దూసుకెళ్లింది. టీసీఎస్ అంచ‌నాల‌కు మించి లాభాలు ప్ర‌క‌టించ‌డంతో ఐటీ స్టాక్స్ లో కొనుగోలు ఉత్సాహం క‌నిపించింది. ఈ రోజు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్, టెక్ మ‌హీంద్రా షేర్లు లాభాలు గ‌డించాయి. మారుతీ సుజుకీ, ఏషియ‌న్ పెయింట్స్, టైటాన్ షేర్లు న‌ష్టాల‌ను చ‌విచూశాయి.

P. Vamshi Kirishna
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here