దేశీయ సాంకేతిక రంగంలో మరో కీలక అడుగు పడనుంది. Indian Space Research Organization రూపొందించిన ISRO Rubidium Atomic Clockతో నావిగేషన్ వ్యవస్థలో పెను మార్పు సంభవించనుంది. ఈ క్లాక్ ను ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లేదా NavICతో పరిధిలో ఉపయోగించేందుకు ఇస్రో తయారు చేసింది.
కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికన్ గవర్నమెంట్ మన దేశానికి GPS యాక్సెస్ ను నిరాకరించిన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత Rubidium Atomic Clock రూపకల్పనకు అడుగులు పడ్డాయి.
ISRO Rubidium Atomic Clockతో ఏం చేస్తారు?
ఇప్పటి వరకు భారత్ లోని అన్ని వ్యవస్థలు అమెరికా రూపొందించిన Network Time Protocolపై ఆధారపడ్డాయి. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు అన్నింటికీ అదే ఆధారం. కానీ త్వరలోనే ఇది పూర్తిగా మారనుంది. *(ISRO Rubidium Atomic Clock)*
ఇండియాలోని స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు సహా అన్ని గడియారాలు ఇకపై ఇస్రో తయారు చేసిన రుబీడియం అటామిక్ క్లాక్ ఆధారంగా పని చేస్తాయి. ఆ దిశగా వాటన్నింటినీ అటామిక్ క్లాక్ తో అనుసంధానం చేయనున్నారు.
Rubidium Atomic Clockను ఇస్రో గత సంవత్సరం రూపొందించింది. స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ NavICలో మొదటిసారి దీన్ని ఉపయోగించింది. వాస్తవానికి NavICలోని తొలి తొమ్మిది ఉపగ్రహాలను 2013 నుంచి 2023 మధ్య సమయంలో లాంఛ్ చేశారు. వాటిలో ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న Rubidium Atomic Clocks వాడారు.
గత సంవత్సరం మేలో ప్రయోగించిన పదో శాటిలైట్ లో మాత్రం ఇస్రో తయారు చేసిన క్లాక్ ను వినియోగించారు. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు ఎక్కువగా ఉపయోగిస్తున్న Atomic Clocksలో సీసియం అణువులను వినియోగిస్తున్నారు. కానీ ఇస్రో తయారు చేసిన గడియారంలో మాత్రం రుబీడియం అణువులను యూజ్ చేశారు.
-పి.వంశీకృష్ణ