ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతం
తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్ స్పేస్‌సెంటర్ (షార్) నుంచి చేపట్టిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (SSLV-D2) ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 9.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D2.. ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు యూఎస్‌ఏ అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 450 కి.మీ ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07, 880 సెకన్లకు జానుస్-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీశాట్‌ను కక్ష్యలోకి చేర్చింది.