హైదరాబాద్ పునరుద్ధరణ కోసం HYDRA పోలీస్ స్టేషన్ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ముఖ్యాంశాలు
చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. HYDRA (Hyderabad Restoration Authority) పోలీస్ స్టేషన్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం లో పలు ముఖ్య విషయాలను ప్రస్తావించారు, నగర పునరుద్ధరణకు HYDRA కీలకం అనే సంకేతాన్ని ఇచ్చారు.

చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. HYDRA (Hyderabad Restoration Authority) పోలీస్ స్టేషన్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం లో పలు ముఖ్య విషయాలను ప్రస్తావించారు, నగర పునరుద్ధరణకు HYDRA కీలకం అనే సంకేతాన్ని ఇచ్చారు.

HYDRA ఎందుకు అవసరం?

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 1908 లో హైదరాబాద్ లో వచ్చిన మహా వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయని గుర్తు చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాతో నిజాం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి చెరువులను నిర్మించారు.

ఈ రోజు, అదే ఆలోచనతో నగరాన్ని పునరుద్ధరించడానికి HYDRA ఏర్పాటు చేశామన్నారు.

Poultary

“హైదరాబాద్‌ను పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతో Hyderabad Restoration Authority ను తీసుకొచ్చాం.”

నగర సమస్యలకు పరిష్కారం HYDRA 

సీఎం వివరించిన సమస్యలు:

  • బెంగుళూరు లో చెరువులు నాశనం కావడం వల్ల తాగునీటి సమస్యలు
  • ముంబై, చెన్నైలో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు
  • ఢిల్లీలో కాలుష్యం వల్ల పాఠశాలలు, కార్యాలయాలు మూత
  • “ప్రకృతిని కాపాడుకోకపోతే, హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థితి వస్తుంది,” అన్నారు సీఎం.

Hyderabad Restoration Authority పని కేవలం కూల్చివేతలకే కాదని స్పష్టంగా చెప్పారు. వర్షపు నీరు నిలిచే సమస్యలను పరిష్కరించడం, ట్రాఫిక్ సదుపాయాలు మెరుగుపరచడం, విద్యుత్ పునరుద్ధరణ వంటి బాధ్యతలు HYDRAకి ఉంటాయి అని తెలిపారు.

చెరువుల ఆక్రమణలకు కఠిన చర్యలు
సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు:

ఎంతటి వారైనా చెరువులు ఆక్రమిస్తే Hyderabad Restoration Authority ఉపేక్షించదు.

కొంత మంది HYDRA పనులను వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

“చెరువులను కాపాడుతామంటే కొందరికి కోపం, పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధ. అయినా ప్రజల మేలుకోసం వెనక్కి తగ్గం.”

రియల్ ఎస్టేట్ పడిపోతుందంటూ వ్యతిరేకిస్తున్నవారిని ప్రశ్నిస్తూ:

“మీ బాధ ఏమిటి? ప్రకృతిని కాపాడడమే తప్పు కాదుగా!”

పేదలకు సహాయంగా, అక్రమాలకు కఠినంగా
సీఎం అధికారులకు సూచన:

“పేదల పట్ల సానుభూతితో, మానవీయ కోణంతో వ్యవహరించండి. పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చర్యలు తీసుకోండి. కానీ పెద్ద అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలి.”

HYDRA ముఖ్య ఉద్దేశ్యం
Hyderabad Restoration Authority ద్వారా చెరువులు, మూసీ, నాలాలను కాపాడి, Hyderabad ను పునరుద్ధరించడం లక్ష్యం. అందులో భాగంగా:

  • ఆక్రమణల తొలగింపు
  • వర్షపు నీరు నిలువకుండా చేసే చర్యలు
  • ట్రాఫిక్ స్ర్ట్రీమ్‌లైన్
  • చెరువుల పునరుద్ధరణ

CM రేవంత్ రెడ్డి యొక్క HYDRA స్థాపన నగర పునరుద్ధరణకు ఒక దృఢమైన చర్య. చెరువులు, మూసీ, నాలాలను కాపాడి, ఆక్రమణలను తొలగించి, ప్రకృతిని రక్షించడం ద్వారా హైదరాబాద్ ను భవిష్యత్తు తరం కోసం ఒక ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన నగరంగా మార్చడం Hyderabad Restoration Authority లక్ష్యం.

సీఎం చివరగా:

వారసత్వ సంపదను కాపాడుకుని, నగరాన్ని పునరుద్ధరించుకుందాం,” అని పిలుపునిచ్చారు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here