Hyderabad Metro. భాగ్యనగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో ముందుంటోంది. ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేరుస్తోంది. 2017లో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి హైదరాబాద్ మెట్రో అందిస్తున్న సేవలు అభినందనీయం. ఈ క్రమంలోనే అనేక ఆఫర్లను ప్రయాణికుల కోసం తీసుకొచ్చింది. అయితే వాటిలో కొన్నింటిని నిలిపివేయాలని L&T Hyderabad Metro Rail Limited నిర్ణయించింది.
Hyderabad Metro Offers ఎప్పటి నుంచి పని చేయవంటే?
మెట్రోలో Super Saver Metro Holiday Card, Metro Student Pass, Super Offer Peak Hour deals వంటి స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి. అందులో Super Saver Metro Holiday Card, Super Offer Peak Hour deals.. మార్చి 31తో ఆగిపోనున్నాయి. అయితే Metro Student Passతో తిరిగే విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీ వరక ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని L&T HMRL తెలియజేసింది.
Super Saver Metro Holiday Card, Metro Student Pass, Super Offer Peak Hour deals అనేవి చాలా పాపులర్ అయ్యాయి. ప్రయాణికులను బాగా ఆకట్టుకున్నాయి. మెట్రోలో రద్దీ పెరిగేందుకు ఇవి కూడా కారణమని చెప్పొచ్చు.
ఇక, విద్యార్థుల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2023 జూలైలో Student Pass-2023ని LTMRHL ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ లో భాగంగా విద్యార్థులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లిస్తే అదనంగా మరో 10 ట్రిప్పులు ఉచితంగా పొందవచ్చు. అన్ని ఫేర్ జోన్ లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
- పి.వంశీకృష్ణ