ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న యుఎస్‌కు చెంది. చారిత్రాత్మకమైన Cumberland University హైదరాబాద్ విద్యార్ధుల కోసం స్పాట్ ఆడ్మిషన్‌ను నిర్వహించనుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది కొత్త గ్రాడ్యుయేషన్ కోర్సులను ప్రారంభించింది.
ఈనెల 18 తేదీ హైదరాబాద్ అమీర్‌పేటలోని అదిత్య హోటల్‌లో స్పాట్ ఆడ్మిషన్లు నిర్వహించనుంది. కంబర్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం అధునాతన డిగ్రీ కోర్సులతో పాటు మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ (MSEM) మరియు మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ IT మేనేజ్‌మెంట్ (MSITM)లను ప్రవేశపెట్టింది.
అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయం కోసం హైదరాబాద్‌లో స్పాట్ ఆడ్మిషన్లు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రోఫెసర్ డాక్టర్ మార్క్ హాన్షా అన్నారు.
మేము కొత్త ప్రారంభించను్న గ్రాడ్యేయేట్ ప్రోగ్రామ్ కోర్సులు అనేక మంది విద్యార్థులతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు ఆయన చెప్పారు.
హైదరాబాద్‌లో ఉన్న యూనివర్సిటీ యొక్క అంతర్జాతీయ సేవా భాగస్వామి అయినా UniversityHUB, రిక్రూట్‌మెంట్ ప్రయత్నాలలో, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ రంగాలలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
“నాష్‌విల్లే యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార మరియు సాంకేతిక కేంద్రాలలో ఒకటి” అని హాన్‌షా తెలిపారు. కంబర్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలోని MSITM మరియు MSEM ప్రోగ్రామ్‌లు రెండూ కోర్సులు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు.
ప్రతి టర్మ్‌లో నిర్దిష్ట వ్యక్తిగతంగా ఆన్‌లైన్ తరగతులను సైతం అందిస్తున్నట్లు చెప్పారు. పెరుగుతున్న విద్యార్థుల డిమాండ్‌ను తీర్చడానికి ఆల్‌లైన్ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా సంబంధిత పరిశ్రమ స్థానాల్లో పని చేయడానికి అనుమతి ఉంటుందన్నారు.
మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు సుమారు ఐదు సెమిస్టర్‌లలో పూర్తయ్యేలా రూపొందించినట్లు తెలిపారు. సంవత్సరానికి మూడు సెమిస్టర్‌లు అందించబడతాయన్నారు.
UniversityHUB సహకారంతో, కంబర్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం భారతదేశంలో “స్పాట్ అడ్మిషన్స్” ఈవెంట్‌ల నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ ఈవెంట్‌లు విద్యార్థులకు MSITM మరియు MSEM ప్రోగ్రామ్‌ల కోసం $7,000 వరకు స్కాలర్‌షిప్‌లను పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థులు మరియు వారి తల్లీదండ్రులు మరింత సమాచారం తెలుసుకునేందుకు కంబర్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం అడ్మిషన్ల ప్రతినిధులు మరియు నాయకత్వంతో నేరుగా మాట్లాడవచ్చాన్నారు.
హాజరైనవారు ఫాల్ ఇన్‌టేక్ (ఆగస్టు 2024) కోసం ఆన్-ది-స్పాట్ అడ్మిషన్‌ల కోసం అవసరమైన పత్రాలను తీసుకురావాలని కోరారు.
Cumberland University గురించి:1842లో స్థాపించబడిన కంబర్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం దక్షిణ యునైటెడ్ స్టేట్స్‌లోని పురాతన ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాలలో ఒకటి.
టేనస్సీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది, ఈ విశ్వవిద్యాలయం 39 రాష్ట్రాలు మరియు 49 దేశాల నుండి విద్యార్థులకు సేవలందిస్తుంది.
కంబర్‌ల్యాండ్ విశ్వవిద్యాలయం U.S. న్యూస్ మరియు వరల్డ్ రిపోర్ట్ ద్వారా దక్షిణాదిలోని ఉత్తమ ప్రాంతీయ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గౌరవించబడుతుంది.