ChatGPT vs Amazon Metis:

OpenAI క్రియేట్ చేసిన ChatGPTకి పోటీగా మార్కెట్ లో ర‌క‌ర‌కాల Chatbots అందుబాటులోకొచ్చాయి. వాటికి దీటుగా మ‌రొక‌టి రాబోతోంది. అదే Metis..! టెక్ దిగ్గ‌జం Amazon దీన్ని తీసుకొచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది.

ChatGPTని ఢీ కొట్టే ఉద్దేశంతో Metisను మ‌రింత అధునాత‌నంగా తీర్చిదిద్దాల‌ని ప్లాన్ చేసింది. ఈ Artificial Intelligence Chatbot.. Amazon internal AI model అయిన‌ Olympusపై ఆధార‌ప‌డి ప‌ని చేస్తుంది. ఇదొక Advanced AI Model.

టెక్ట్స్ తో పాటు విజువ‌ల్ ఇన్ పుట్ ను ఇది స్వీక‌రిస్తుంది. డేటాను అన‌లైజ్ చేస్తుంది. Decisionsను తీసుకుంటుంది. ప్రోగ్రాం చేసిన అల్గారిథ‌మ్స్ ఆధారంగా మ‌ల్టిపుల్ యాక్ష‌న్స్ ను Execute చేస్తుంది.

Poultary

ఇప్ప‌టికే చాలా కంపెనీలు Artificial Intelligence Assistantsను తీసుకొచ్చాయి. వాటికి Metis గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశ‌ముంది.

ChatGPT vs Amazon Metis
ChatGPT vs Amazon Metis

Apple iOS 18 beta 2:

యూజ‌ర్లకు స‌రికొత్త‌దనాన్ని ప‌రిచ‌యం చేయ‌డంలో Apple ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అలాంటి మ‌రో అప్ డేట్ ను ఇప్పుడు తీసుకొచ్చింది.

Apple iOS 18 beta 2 వ‌ర్ష‌న్ ను రిలీజ్ చేసింది. beta 1కు మించిన ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. iPhones స్క్రీన్ల‌ను Mac కంప్యూట‌ర్ల‌లో చూసేందుకు వీలుగా iPhone Mirroringను తీసుకొచ్చింది.

డార్క్ మోడ్ ఫీచ‌ర్ తో App Storeను అందుబాటులో ఉంచింది. వీటితో పాటు RCS Messaging, 27 భార‌తీయ భాష‌ల‌ను స‌పోర్ట్ చేసే కీబోర్డ్ వంటి న్యూ ఫీచ‌ర్ల్ యాడ్ చేసింది.

Apple iOS 18 beta 2
Apple iOS 18 beta 2

Royal Enfield:

ప్ర‌ముఖ టూవీల‌ర్ త‌యారీ సంస్థ Royal Enfieldకు కాంపిటీష‌న్ గా బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ Classic Legends కొత్త మోటార్ సైకిల్ తీసుకొస్తోంది.

ఇండియ‌న్ మార్కెట్లో రెట్రో మోటార్ సైకిళ్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో 650సీసీ బైక్ తేవాల‌ని ప్లాన్ చేసింది. వచ్చే ఆగస్టు 15న కొత్త మోటార్ సైకిల్ మ‌న‌దేశంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ పేరుతో దీన్ని విక్రయిస్తున్నారు.

టాప్ పై ట్విన్ పాడ్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్రంట్ ఎండ్ లో రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంటాయి. సింగిల్ పీస్ సీట్, బ్యాక్ లో ఫెండర్ కాంబో, రెట్రో టెయిల్ లాంప్ కూడా అమ‌ర్చార‌ని తెలుస్తోంది.

స్ట‌యిలిష్ లుక్ లో ఇది అట్రాక్ట్ చేయ‌నుంది.

Royal Enfield Classic Legends
Royal Enfield Classic Legends

Stock Market:

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాల కార‌ణంగా మంగ‌ళ‌వారం స‌రికొత్త రికార్డును న‌మోదు చేశాయి. ఆర్థిక, బ్యాంకింగ్ స్టాక్స్ లో లాభాల వ‌ల్ల ట్రేడింగ్ సానుకూలంగా సాగింది.

చివ‌రి వ‌ర‌కు అదే ఊపు కొన‌సాగింది. ప్రారంభ స‌మ‌యంలో సెన్సెక్స్ 77,529.19 పాయింట్లుగా ఉంది. రోజంతా లాభాల బాట‌లోనే ప‌య‌నించింది. చివ‌ర‌కు 712.44 పాయింట్లు గెయిన్ అయి 78,053.52 ద‌గ్గ‌ర క్లోజ్ అయింది. అటు, నిఫ్టీ కూడా 183.45 పాయింట్లు లాభ‌ప‌డి 23,721.30 ద‌గ్గ‌ర ముగిసింది.

సెన్సెక్స్ 78 వేల మార్కును దాట‌డం దేశీయ స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి కావ‌డం విశేషం..

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here