ఆంధ్రప్రదేశ్ లో నూతన సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.(Chandrababu Naidu Oath Ceremony) కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఈ కార్యక్రమం జరిగింది.
చంద్రబాబు, పవన్ తో పాటు మరో ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.(Chandrababu Naidu Oath Ceremony) చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
హాజరైన ప్రముఖులు..:
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
వారితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరై చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్ తో పాటు ఇతర సెలబ్రిటీలు అటెండయ్యారు.
-
సగానికి పైగా కొత్త ముఖాలు..:
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఈ సారి సగానికిపైగా కొత్తవాళ్లకు అవకాశం దక్కింది. ముగ్గురు మహిళలకు ఛాన్స్ కల్పించారు. ఏపీ మంత్రివర్గంలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒక్కరికి చోటు లభించింది.
- పవన్ కళ్యాణ్ (జనసేన)
- నారా లోకేశ్ (టీడీపీ)
- అచ్చెన్నాయుడు (టీడీపీ)
- కొల్లు రవీంద్ర (టీడీపీ)
- నాదెండ్ల మనోహర్ (జనసేన)
- డాక్టర్ నారాయణ (టీడీపీ)
- వంగలపూడి అనిత (టీడీపీ)
- నిమ్మల రామానాయుడు (టీడీపీ)
- పయ్యావుల కేశవ్ (టీడీపీ)
- సంధ్యారాణి (టీడీపీ)
- సత్యప్రసాద్ (టీడీపీ)
- వీరాంజనేయ స్వామి (టీడీపీ)
- గొట్టిపాటి రవికుమార్ (టీడీపీ)
- కందుల దుర్గేశ్ (జనసేన)
- జనార్ధన రెడ్డి (టీడీపీ)
- టీజీ భరత్ (టీడీపీ)
- సవిత (టీడీపీ)
- సుభాష్ (టీడీపీ)
- కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ)
- ఫరూక్ (టీడీపీ)
- ఆనం రామనారాయణ రెడ్డి (టీడీపీ)
- రాంప్రసాద్ రెడ్డి (టీడీపీ)
- పార్థసారథి (టీడీపీ)
- సత్యకుమార్ యాదవ్ (బీజేపీ)
-
చిరు, పవన్ తో మోడీ..:
వేదికపైకి చేరుకున్నాక ప్రధాని మోడీ.. చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. బాబుకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమం ముగిశాక స్టేజీపై ఉన్న నేతలందరినీ మోడీ పలకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చిరంజీవితో కలిసి ముచ్చటించారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
- పి.వంశీకృష్ణ