BSNL
BSNL

మొబైల్ ఫోన్లు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మారాయి..! ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర రెండు, మూడు కూడా ఉంటున్నాయి. మినిమం డ్యుయ‌ల్ సిమ్ అయితే క‌చ్చితంగా వాడుతున్నారు. ఇక అందులో రీఛార్జ్ అంటే త‌డిసి మోపెడ‌వుతోంది. (BSNL)

ఇలాంటి ప‌రిస్థితుల్లో టెలికాం కంపెనీలు తీసుకున్న నిర్ణ‌యం మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టుగా మారింది. Jio, Airtel, Vodafone Idea సంస్థ‌లు టారిఫ్ రేట్లు భారీగా పెంచ‌డంతో యూజ‌ర్లు వామ్మో అంటున్నారు.

Reliance Jio రీఛార్జ్ టారిఫ్ ల‌పై 12 నుంచి 27 శాతం పెంపును ప్ర‌క‌టించింది. ఇక Airtel మొబైల్ టారిఫ్ లు కూడా 10 నుంచి 21 శాతానికి పెరిగాయి. గ‌త వారం నుంచి ఇవి అమ‌ల్లోకి వ‌చ్చాయి.

Poultary

BSNLతో యూజ‌ర్ల‌కు రిలీఫ్..:

Jio, Airtel, Vodafone Idea.. టారిఫ్ ధ‌ర‌ల‌ను భారీగా పెంచ‌డంతో యూజ‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వారికి Bharat Sanchar Nigam Limited – BSNL గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త‌గా 249 రూపాయ‌ల రీఛార్జ్ ప్లాన్ ను అనౌన్స్ చేసింది.

ఈ ప్యాక్ లో క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ల‌ను BSNL తీసుకొచ్చింది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు రోజుకు 100 ఎస్.ఎం.ఎస్ లు పొందొచ్చు. అలాగే 2 జీబీ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక‌, ప్లాన్ వ్యాలిడిటీని 45 రోజులుగా నిర్ణ‌యించింది.

Airtelలో ప్లాన్ ఎలా ఉందంటే..?

అదే 249 రీఛార్జ్ ప్లాన్ ను Airtelలో గ‌మ‌నిస్తే.. అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. కానీ రోజుకు 1 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. వ్యాలిడిటీ కూడా 28 రోజులు మాత్ర‌మే.

ఇక Reliance Jioలో ఇదివ‌ర‌కు ఉన్న 239 ప్యాక్ ధ‌ర‌ను ఏకంగా 299 రూపాయ‌ల‌కు పెంచారు. ఇందులో అప‌రిమిత కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ, 1.5 జిబీ డేటాను పొందొచ్చు. Vodafone Ideaలో 299 రీఛార్జ్ తో రోజుకు 1 జీబీ డేటా వినియోగించుకోవ‌చ్చు. 28 రోజుల వ్యాలిడిటీ ఇందులో ఉంటుంది.

BSNL వైపు వినియోగ‌దారుల మొగ్గు..!

Jio, Airtel, Vodafone Idea కంపెనీలు టారిఫ్ రేట్ల‌ను భారీగా పెంచ‌డంతో ఇప్పుడు వినియోగ‌దారులు BSNLవైపు మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర ఆఫ‌ర్లు త‌క్కువ రేటుకే అందుబాటులో ఉండ‌టంతో దానివైపు మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

249 ప్లాన్ ద్వారా మిగ‌తా నెట్ వ‌ర్క్ ల‌తో పోలిస్తే బీఎస్ ఎన్ ఎల్ లో 17 రోజుల అద‌న‌పు వ్యాలిడిటీ కూడా పొందొచ్చు. దీంతో చాలా మంది అదే నెట్ వ‌ర్క్ కు పోర్ట్ పెట్టుకుంటున్న‌ట్టు స‌మాచారం.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here