ప్రపంచ వ్యాప్తంగా Layoffs సీజన్ నడుస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఆర్థిక భారాన్ని, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్దెత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో గత రెండేళ్లలో కొన్ని లక్షల మంది Layoffs బారిన పడ్డారు. అందులో ప్రైవేట్ సెక్టార్ లో పని చేసే వాళ్లే ఎక్కువ. Argentina President షాకింగ్ నిర్ణయం
అయితే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో పని చేసే ఉద్యోగులపై కూడా వేటు పడనుంది. పదులు కాదు వందలు కాదు ఏకంగా 70 వేల మంది జాబ్స్ కోల్పోనున్నారు. అర్జెంటీనాలో మరికొద్ది రోజుల్లో ఇది జరుగబోతోంది. బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.
ఎందుకీ కఠిన నిర్ణయం?:
గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసే 70 వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను విధుల నుంచి తీసేయాలని అర్జెంటీనా అధ్యక్షుడు జావియెర్ మిలీ షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. అందుకు సన్నాహాలు కూడా మొదలుపెట్టారని బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఆర్థిక పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
అర్జెంటీనా ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఆ ఉద్యోగులు పని చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ లో భాగంగా వారితో చేసుకున్న ఒప్పందం త్వరలో ముగియనుంది. వాస్తవానికి గత సంవత్సరమే ఆ అగ్రిమెంట్ అయిపోయింది. దీంతో అప్పట్లో దాన్ని పొడిగించారు.
కానీ ఇప్పుడు మాత్రం మరోసారి రెన్యువల్ చేయబోమని జావియెర్ మిలీ తేల్చి చెప్పేశారు. *(Argentina President షాకింగ్ నిర్ణయం)* అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా భారీ ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు కూడా. ఈ వ్యవహారంపై కేవలం అర్జెంటీనాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.
అర్జెంటీనాలో ఇదీ పరిస్థితి:
అర్జెంటీనాలో ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతో, మిలీ సర్కారు ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలకు దిగింది. దీనిలో భాగంగానే ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది.
- పి.వంశీకృష్ణ