Alpha Hotel..! హైదరాబాదీలకే కాదు.. ఇతర ప్రాంతవాసులకు కూడా పరిచయం అక్కర్లేని పేరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉండే Alpha Hotelకు ప్రతినిత్యం వేలాది మంది వస్తారు. అక్కడ దొరికే టేస్టీ ఫుడ్.. వాళ్లందరి మనసు దోచేస్తుంది.
ఇరానీ ఛాయ్, బిర్యానీతో పాటు ఎన్నో రకాల వంటకాలు నోరూరిస్తాయి. వాటిని తిన్న ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
కానీ కొద్దిరోజులుగా Alpha Hotel పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో దొరికే ఆహారం నాణ్యత సరిగా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో Alpha Hotel యాజమాన్యం స్పందించింది.
ఈ కథనాలన్నీ అవాస్తవమని కొట్టిపారేసింది. న్యూస్ పేపర్లు, సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
FSSAI రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నాం:
FSSAI రూల్స్ ప్రకారమే తాము నడుచుకుంటున్నామని.. ప్రతిరోజూ వేలాది మందికి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని Alpha Hotel యాజమాన్యం తెలిపింది. అందువల్ల తప్పుడు కథనాలు ప్రచురించవద్దని సూచించింది.
“ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమైనవి. వాటిని ప్రచారం చేస్తున్న వారికి కూడా ఆ విషయం తెలుసు. మాకున్న మంచి పేరుకు కాపాడుకునేందుకు మేం ఎప్పుడూ ప్రయత్నిస్తాం. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై లీగ్ యాక్షన్ తీసుకుంటాం “అని ఆల్ఫా హోటల్ ప్రతినిధులు హెచ్చరించారు.
అలాంటి వారిపై చర్యలు తప్పవు:
నియమ, నిబంధనలన్నీ తాము పాటిస్తామని.. కావాలంటే ఎవరైనా వచ్చి చూడొచ్చని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించిన చిన్నపాటి మార్పులను కూడా చేస్తామని చెప్పారు.
తప్పుడు కథనాలతో తమ ప్రతిష్టను దెబ్బతీయాలని కొందరు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో వారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పారు. అలాంటి వారిని కోర్టుకు లాగుతామని అన్నారు.
తమ కిచెన్ ను తనిఖీ కోసం తెరిచే ఉంచుతామని.. ఆల్ఫా హోటల్ పాటించే ప్రమాణాలపై ఎవరికైనా అనుమానాలుంటే స్వయంగా వచ్చి పరిశీలించవచ్చని చెప్పారు.