సస్టైన్‌కార్ట్ రీటైల్ స్టోర్ ని ప్రారంభించిన అక్కినేని అమల
పర్యావరణ రహిత ఉత్పత్తులను ఎంతో మేలు చేస్తాయని ప్రముఖ సినీ నటి, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఫౌండర్ అక్కినేని అమల అన్నారు. సుస్థిరమైన పర్యావరణ రహిత ఉత్పత్తులను అందించే ఇ-కామర్స్ సంస్థ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1లో ఏర్పాటు చేసిన ‘సస్టైన్‌కార్ట్’ భారతదేశపు మొట్టమొదటి సస్టైన్ కార్ట్ రీటైల్ స్టోర్ ను అక్కినేని అమలతో పాటు తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డైరెక్టర్ శిఖా గోయెల్ లు ప్రారంభించారు. అక్కినేని అమల తో పాటు మెగాస్టార్ చిరంజీవి కుమార్తైలు సుస్మితా , శ్రీజా కొణిదెల, నటి నిహారిక కొణిదెల, నటులు సుమంత్, సామ్రాట్ రెడ్డి, నటి లక్షీ మంచు, సినీ దర్శకులు శశికరణ్ టిక్క వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నటి అమల అక్కినేని మాట్లాడుతూ సస్టైన్‌కార్ట్ రీటైల్ రంగంలో రావడం గర్వంగా ఉందని, ప్రకృతి పరంగా తయారయ్యే వేలాది ప్యాషన్, ఆహార , గృహలంకరణ ఉత్పత్తులు ఒకే వేదికలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
సస్టైన్‌కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ కాంతి దత్, సస్టైన్‌కార్ట్ సహ వ్యవస్థాపకురాలు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత హైబ్రిడ్ సూపర్‌మార్కెట్ నుండి పర్యావరణ వస్తువులను పరిశోధించి, కొనుగోలు చేయడం ఎంతో సమయం పడుతుందని అయితే ‘సస్టైన్‌కార్ట్’ వినియోగదారులు తమ దైనందిన అవసరాలన్నింటికీ పర్యావరణ రహిత ఉత్పత్తులను మాత్రమే అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా రాబోయ మూడు నెలల్లో సస్టైన్‌కార్ట్… దక్షిణభారతదేశంలోని మాల్స్, విమానాశ్రయాల్లో 20 ఫ్లాగ్షిప్ స్టోర్లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంగా అర్బన్ కిస్సాన్, ట్రైబ్ కాన్సెప్ట్స్, భూమిత్ర, రేనాడు మిల్లెట్స్, ఫ్లైబెర్రీ, ఫ్రమ్ వేదస్, కోకోసూత్ర వంటి బ్రాండ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు.























