ముఖ్యఅతిథులుగా హాజ‌రైన డాక్ట‌ర్ రామ్ కిష‌న్, డాక్ట‌ర్ బి. భాస్క‌ర్ రావు, డాక్టర్ ఆశిష్ మణివణ్ణన్, వెంకట్ రవి కుమార్

వైద్య రంగంలో 60కి పైగా పురస్కారాలను అందజేసిన హైబిజ్ టీవీ

హైదరాబాద్ హెచ్.ఐ.సి.సి నోవాటెల్ లో కార్యక్రమం నిర్వహణ

Poultary

దేశవ్యాప్తంగా మెడికల్, హెల్త్ కేర్ విభాగాల్లో అమూల్యమైన సేవలను అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని హైబిజ్ టీవీ ఘనంగా సత్కరించింది. ప్రాణ రక్షకులను పురస్కారాలతో గౌరవించింది. హైబిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ 4వ ఎడిషన్ లో భాగంగా 60 మందికి పైగా వీటిని అందజేసింది. వరుసగా నాలుగో ఏడాది హైబిజ్ టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.

హైదరాబాద్ లోని హెచ్.ఐ.సి.సి నోవాటెల్ లో జరిగిన ఈ ప్రోగ్రాంకు డాక్టర్ ఎ. రామ్ కిషన్ (డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ – భారత ప్రభుత్వం), డాక్టర్ బి. భాస్కర్ రావు (కిమ్స్ హాస్పిట‌ల్స్ గ్రూప్ ఛైర్మ‌న్), డాక్టర్ ఆశిష్ మణివణ్ణన్ (వైస్ ఛైర్మన్, మహేశ్వర మెడికల్ కాలేజ్ & హాస్పిటల్), వెంకట్ రవి కుమార్ టి (బ్రాండ్ మార్కెటింగ్, అపర్ణ కన్ స్ట్రక్షన్స్ & ఎస్టేట్) ముఖ్యఅతిథులుగా హాజ‌ర‌య్యారు. వారితో పాటు డాక్టర్ సవితా సుఖ్ దేవ్ (డైరెక్టర్ – రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్), డాక్టర్ శ్రీధర్ కస్తూరి (ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్), ఎం. రాజ్ గోపాల్ ( మేనేజింగ్ డైరెక్టర్ – హైబిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ – హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ కేర్ ప్రొఫెష‌న్ అనేది చాలా క్లిష్ట‌త‌ర‌మైన‌ద‌ని డాక్ట‌ర్ బి. భాస్కర్ రావు చెప్పారు. అలాంటి వృత్తిలో ప‌నిచేస్తున్న వారిని గుర్తించి.. హైబిజ్ టీవీ పుర‌స్కారాలు ఇవ్వ‌డం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు. హాస్పిట‌ల్ బిల్స్ తో పాటు వైద్య రంగంపై ప్ర‌జ‌ల‌కు మరింత అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అలాగే హెల్త్ ఇన్సురెన్స్ అనేది ఈ రోజుల్లో ఎంతో ముఖ్య‌మ‌ని చెప్పారు. ఆరోగ్య శ్రీ సేవ‌ల గురించి కూడా డాక్ట‌ర్ బి. భాస్క‌ర్ రావు ప్రస్తావించారు. వైద్య రంగంలో ఉన్న వారికి పేషెంట్లే దేవుళ్ల‌ని తెలిపారు. వారికి సేవ చేయ‌డ‌మే ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యంగా భావించాల‌ని చెప్పారు.

ఈవెంట్ హైలైట్స్:

*) హైబిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ 4వ ఎడిషన్ లో భాగంగా కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ బి. భాస్కర్ రావును ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారంతో సత్కరించారు. మా ఇ.ఎన్.టి రీసెర్చ్ ఫౌండేషన్ కు ఈ ఏడాదికిగానూ బెస్ట్ ఎన్జీవో అవార్డు దక్కింది.

*) అద్భుత ఆవిష్కరణలతో పాటు రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న 11 హాస్పిటల్స్ కు హైబిజ్ టీవీ హెల్త్ కేర్ పురస్కారాలు దక్కాయి.

*) 11 మంది ట్రైల్ బ్లేజర్ లు కూడా అవార్డులను అందుకున్నారు.

*) డాక్టర్ శ్రీధర్ కస్తూరి నేతృత్వంలో ప్రాక్టీసింగ్ వైద్యులు, మెడికల్ స్టూడెంట్స్ కోసం మెడికల్ సింపోజియం నిర్వహించారు.

*) మెడికల్, హెల్త్ కేర్ రంగంలో పేరున్న ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయా విభాగాల్లో సిబ్బంది కృషిని గుర్తించి హైబిజ్ టీవీ పురస్కారాలు అందజేయడం గొప్ప విషయమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here