భద్రతే ధ్యేయంగా… భారత్ లో మొట్టమొదటి శక్తివంతమైన సోడియం అయాన్ బ్యాటరీలను విడుదల చేసిన సోడియన్ ఎనర్జీ
ప్రముఖ సోడియం అయాన్ బ్యాటరీ డెవలపర్ సోడియన్ ఎనర్జీ సంస్థ తమ స్వయం సాంకేతికతతో అభివృధ్ది చేసిన సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తులను మొట్ట మొదటి సారిగా భారత్ మార్కెట్ లోకి హైదరాబాద్ వేదికగా విడుదల చేసింది. దీనితో పాటు వాటికి ఉపకరించే యుపిఎస్, స్టార్టర్ బ్యాటరీ మరియు బ్యాటరీ ప్యాక్ వంటి సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తులను ప్రకటించింది.
శ్రీ బాల పచియప్ప,కో-ఫౌండర్, సోడియన్ ఎనర్జీ మాట్లాడుతూ…
ప్రస్తుతం మార్కెట్ లో వున్న సాధారణ లెడ్ యాసిడ్, లిథియం-అయాన్ బ్యాటరీల కంటే సోడియం-అయాన్ (Na-ion) సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ బ్యాటరీలు ఎక్కువ శక్తి నిల్వలను కలిగి వుంటాయని అన్నారు. 2026 నాటికి విద్యుత్ నిల్వల అవసరం ఐదు రెట్లు పెరుగుతుందని ముఖ్యంగా అధిక జనాభా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ శక్తి నిల్వలు పవర్ స్టోరేజీ దోహదపడే అవకాశం వుంటుందని సోడియన్ ఎనర్జీ,కో ఫౌండర్, బాల పచియప్ప తెలిపారు.
ఎన్ఐబిలు ఇతర రకాల బ్యాటరీల కంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. భద్రత, నాణ్యత, వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి.
ఉదాహరణకు అధిక ఎత్తును కలిగిన భారీ రోడ్డు మార్గాలలో కూడ ఎలక్ట్రిక్ బైక్ లు మరింత శక్తివంతంగా పని చేస్తాయి. గ్యాసోలిన్ వాహనాల కోసం బ్యాకప్ పవర్ సప్లైస్, సోలార్ ఎనర్జీ స్టోరేజ్ మరియు స్టార్టర్ బ్యాటరీలు వంటి అనువర్తనాలలో కూడా ఎన్ఐబిలు ప్రకాశిస్తాయి.
ఎన్ఐబిల యొక్క అతి ప్రధానమైన ప్రయోజనాలలో ఒకటి భద్రత. లిథియం అయాన్ బ్యాటరీల (ఎల్ఐబి) తో ఫైర్ సేఫ్టీ పెద్ద సమస్యగా మారింది. కానీ సోడియం అయాన్ ఆధారిత బ్యాటరీలు అతిగా ఛార్జ్ చేయటం లేదా ఏదైనా ప్రమాదాలలో వీటి నష్టం చాలా తక్కువగా వుంటూ వినియోగదారుల భద్రతను కాపాడుతుంది.
లిథియం కంటే సోడియం 500 రెట్లు అధికంగా వుంటూ పర్యావరణానికి హాని లేకుండా రికవరీ మరియు రీసైక్లింగ్ కి అనుకూలంగా వుంటుంది. లిథియం లభ్యత కొన్ని దేశాలకు చాల పరిమితంగా ఉన్న క్రమంలో అందరికి సోడియం – అయాన్ బ్యాటరీల ఉపయోగం ఎక్కువగా వుండే అవకాశం వుంటుంది.
సోడియన్ ఎనర్జీని పి.బాలా మరియు ప్రొఫెసర్ సిసి హాంగ్ సంయుక్తంగా స్థాపించారు. వీరిద్దరూ మూడు దశాబ్దాలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పన మరియు సాంకేతికతలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. వారి అనుభవంతోనే సోడియన్ ఎనర్జీ తన బ్యాటరీ ప్యాక్ తయారీతో పాటు అప్లికేషన్ సామర్థ్యాలను మరింతగా పెంచుకుంటోంది.
కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేలా సోడియం అయాన్ బ్యాటరీ సాంకేతికతను కలిగి వుందని… ఇదే నినాదంతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మార్చి 2024 లో ప్రత్యేక రోడ్ షోలను నిర్వహిస్తున్నట్లు సోడియన్ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు తెలిపారు