20th edition of Bio Asia conference

20వ ఎడిషన్‌ బయో ఆసియా సదస్సును ప్రారంభించిన కేటీ రామారావు

ఆసియాలో అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ మరియు ఆరోగ్య సంరక్షణ సదస్సు 20వ ఎడిషన్‌ బయో ఆసియా నేడు ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఈ సదస్సును జాతీయ, అంతర్జాతీయ ఉద్ధండుల సమక్షంలో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు తొలి రోజు ప్రభుత్వ అధికారులు, బిజినె స్‌ ఎగ్జిక్యూటివ్‌లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన వ్యక్తులు పాల్గొన్నారు.

అడ్వాన్సింగ్‌ ఫర్‌ ఒన్‌ : షేపింగ్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ ఆఫ్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌కేర్‌’ నేపథ్యంతో నిర్వహిస్తున్న ఈ వార్షిక ప్రతిష్టాత్మక కార్యక్రమంను తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ సదస్సును తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖామాత్యులు శ్రీ కేటీ రామారావు ప్రారంభించారు.

20వ ఎడిషన్‌ బయో ఆసియాఈ సదస్సును ప్రారంభించిన అనంతరం తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖామాత్యులు శ్రీ కేటీ రామారావు మాట్లాడుతూ ‘‘ కొవిడ్‌–19 మహమ్మారి ప్రతి ఒక్కరికీ సహకరించుకోవడంలోని ఆవశ్యకత, ప్రజా సంక్షేమవంపై దాని ప్రభావాన్ని గురించి వెల్లడించింది. మానవ జాతికి అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సవాల్‌ను అధిగమించడానికి ప్రపంచమంతా ఏకమైన వేళ ఇది మరింతగా కనిపించింది.

Poultary

అందువల్ల, బయో ఏసియా సదస్సు  నేపథ్యమైన ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ ఒన్‌ ’ అనేది ఈ సహకారపు స్ఫూర్తిని వేడుక చేస్తుంది మరియు మానవ జాతి వికాసాన్ని ప్రోత్సహిస్తుంది. బయో ఆసియా ఎదుగుతున్న తీరు ఆనందకరంగా ఉంది. తెలంగాణా మరియు భారతదేశంలో లైఫ్‌ సైన్సెస్‌ అభివృద్ధికి ఇది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందని చెప్పగలను’’ అని అన్నారు.

లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమలో తెలంగాణా సాధించిన ప్రగతి గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ 2030 నాటికి ఈ రంగపు విలువను రెట్టింపు చేసి 100 బిలియన్‌ డాలర్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యం చేసుకున్నాము. చాలామంది ఇది మరీ ఎక్కువ లక్ష్యమనుకుంటారు. అయితే 2022లోనే మేము లైఫ్‌సైన్సెస్‌ రంగంలో 80 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకున్నామని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాను.

ప్రస్తుత వేగంతో వెళితేనే, 2025 నాటికి మేము 100 బిలియన్‌డాలర్ల మైలురాయిని చేరుకోగలమనే నమ్మకంతో ఉన్నాము. అంటే, షెడ్యూల్‌కు ఐదు సంవత్సరాల ముందే లక్ష్యం చేరుకోగలము. ఇది తెలంగాణాలో అసాధారణ వృద్ధి వేగంకు ప్రాతినిధ్యం వహిస్తుంది. గత రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణాలో ఈ రంగం 23% వృద్ధి నమోదు చేస్తుంది. అదే సమయంలో జాతీయ వృద్ధి కేవలం 14%గా మాత్రమే ఉంది’’ అని అన్నారు

తెలంగాణా రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ వృద్ధి పట్ల తమ లక్ష్యం గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ నేడు , మేము ప్రపంచంలో అత్యుత్తమ లైఫ్‌ సైన్సెస్‌ కేంద్రంగా వెలుగొందుతున్నాము. అలాగని ఇక్కడ మేము ఆగిపోవాలనుకోవడం లేదు. లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమ భవిష్యత్‌కు పునరాకృతి కల్పించే వినూత్న అవకాశాలు మాకు ఉన్నాయి. భారీ కలలు కనడమే కావాల్సింది.

20వ ఎడిషన్‌ బయో ఆసియా2030 నాటికి, లైఫ్‌ సైన్సెస్‌ వ్యవస్ధ విలువ 250 బిలియన్‌ డాలర్లు దాటి పోతుందని నా అంచనా. అంతేకాదు, ప్రపంచపు హెల్త్‌–టెక్‌ మక్కాగా హైదరాబాద్‌ను నిలిపేందుకు మేము తగిన కార్యక్రమాలను రూపొందించబోతున్నాము. మా పలు ఇన్‌క్యుబేటర్‌ కార్యక్రమాల ద్వారా మరియు డీప్‌ కంప్యూటింగ్‌ వనరులతో మేము ఆరోగ్య సంరక్షణ, సాంకేతికతను మిళితం చేయగలము’’ అని అన్నారు.

ఈ సదస్సులో ఆసక్తికరంగా కీలకోపన్యాసాన్ని నొవార్టిస్‌, స్విట్జర్లాండ్‌ సీఈఓ డాక్టర్‌ వాస్‌ నరసింహన్‌ చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధ వృద్ధి గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘‘ దాదాపు 15 సంవత్సరాల క్రితం, నేను హైదరాబాద్‌కు ఇక్కడ ఓ కెపాసిటీ సెంటర్‌ నిర్మించాలనే ఆలోచనతో వచ్చాను. ఇప్పుడది అది పలు రెట్లు పెరిగింది.

గత ఐదు సంవత్సరాలలో , మేము ఇక్కడ మా కార్యకలాపాలను రెట్టింపు చేశాము. ఆ తరువాత మా అత్యంత కీలకమైన డ్రగ్‌ డెవలప్‌మెంట్‌, డాటా మేనేజ్‌మెంట్‌, పేషంట్‌ సేఫ్టీ, తయారీ కేంద్రాలు, ప్రొక్యూర్‌మెంట్‌, పీపుల్‌ మేనేజ్‌మెంట్‌, బహుళ సీనియర్‌ రోల్స్‌ను ఇక్కడకు తీసుకువచ్చాము.

హైదరాబాద్‌ ఇక ఎంత మాత్రమూ నోవార్టిస్‌కు సర్వీస్‌ సెంటర్‌ కాదు, ఇది మా కార్పోరేట్‌ సెంటర్‌. ప్రపంచం మొత్తంమ్మీద మాకున్న మూడు ముఖ్య కేంద్రాలలో ఇది ఒకటి. దీని పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. ఇది కేవలం హైదరాబాద్‌కు మాత్రమే కాదు, ఇండియా వృద్థి కథలో అత్యంత కీలకం. ఈ కారణం చేతనే, మేము మా వాల్యూచైన్‌ కూడా వృద్ధి చేయబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ నైపుణ్యం అపారం. భారతదేశానికి పెట్టుబడులు కొనసాగించేందుకు ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఇదే ఆహ్వానం’’అని అన్నారు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here