కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సర్వం సిద్ధం

కమాండ్ కంట్రోల్ సెంటర్:

తెలంగాణకే తలమానికం … భాగ్యనగర నిఘా నేత్రం … అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణం … కమాండ్ కంట్రోల్ సెంటర్ (సి.సి.సి). వందలాది కోట్లతో నిర్మితమైన ఈ కట్టడం సేవలను అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆగస్ట్ 4న సి.సి.సి ప్రారంభోత్సవం ఘనంగా జరుగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశంలో మరెక్కడా ఇలాంటి సెంటర్ లేకపోవడం విశేషం.

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మించారు. ఇది నాలుగు టవర్లు (ఏ, బీ, సీ, డీ) కలిగిన అధునాతన కట్టడం. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో … 20 అంతస్తులతో వీటిని నిర్మించారు. డబుల్ గ్లాస్ కర్టెన్ వాల్ వంటి అద్భుత సాంకేతికతను వినియోగించారు.
టవర్ – ఏ ..: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్, పరిపాలనా విభాగం వంటిని ఇందులో ఉంటాయి.
టవర్ – బీ ..: అన్ని సీసీ కెమెరాలకు అనుసంధానంగా ఉండే స్టేట్ లెవల్ సర్వైలెన్స్ ను దీంట్లో ఏర్పాటు చేశారు. షీ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, హాక్ ఐ, ట్రాఫిక్ కమాండ్ సెంటర్ వంటి విభాగాలు కూడా ఉంటాయి.
టవర్ – సీ ..: మల్టీ ఏజెన్సీ రూం, ఆడిటోరియం.
టవర్ – డీ …: ఇతర విభాగాలు, డేటా సెంటర్లు.

సి.సి.సిలో సీఎం, హోం మంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ కోసం ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూంలో ప్రత్యేకంగా డేటా సెంటర్ ను అందుబాటులో ఉంచారు. శాంతి భద్రతల పరిరక్షణ … విపత్తుల నిర్వహణలో సి.సి.సి కీలకంగా వ్యవహరించనుంది. పోలీస్ విభాగంతో పాటు ఇతర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా దీన్ని ఏర్పాటు చేశారు. వరదల వంటి ప్రకృతి విపత్తుల పర్యవేక్షణకు ఇదొక వార్ రూమ్ గా పని చేయనుంది. తెలంగాణలో ఎక్కడ విపత్తులు వచ్చినా … సి.సి.సి నుంచి పర్యవేక్షించి తగిన చర్యలు చేపట్టే వీలుంది.

Poultary

సి.సి.సి నిర్మాణానికి రూ. 500 కోట్లకు పైగా ఖర్చయిందని అంచనా. ఇందులోని 14వ ఫ్లోర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతిస్తారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుగా రెండు ఫ్లోర్లు అందుబాటులో ఉంచారు. రూఫ్ టాప్ పై హెలీ ప్యాడ్ సదుపాయాన్ని కల్పించారు. సి.సి.సిలో ఉపయోగించే అధునాతన పరికరాలను జర్మనీ, బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్నారు.

సి.సి.సి ప్రారంభోత్సవం నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. మెయిన్ ఎంట్రన్స్, పోర్టికో, మ్యూజియం, ఆడిటోరియం పనులను పరిశీలించారు. ఇంకో మూడు రోజుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. భాగ్యనగర సిగలో మరో కలికితురాయిగా మిగలనుంది.

 

ALSO READ: సౌర‌శ‌క్తి వినియోగంలో మ‌రో విప్ల‌వం … ప్రింటెడ్ సోలార్ టెక్నాల‌జీ

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here