భారతీయ రైస్ ఎగుమతులలో అగ్రగామిగా నిలిచిన డెక్కన్ గ్రెయింజ్ ఇండియా, తాజాగా చైనాలో అడుగుపెట్టింది. ఇది కంపెనీకి మరో మైలురాయి మాత్రమే కాదు — దక్షిణ భారతదేశం నుంచి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న బ్రాండ్‌గా డెక్కన్ రైస్ నిలబడింది.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన డెక్కన్
డెక్కన్ రైస్ ఇప్పటికే స్వీడన్, యూకే, జర్మనీ, ఐర్లాండ్, లండన్, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఈయూ, టర్కీ వంటి దేశాలలో 30 రకాల భారతీయ బియ్యంని విజయవంతంగా ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు చైనా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైస్ ఉత్పత్తిదారుడు, డెక్కన్ వ్యాపార పటములోకి చేరింది.
“చైనాలో అడుగుపెట్టడం మా ప్రయాణంలో విశేష ఘట్టం,” అని తెలిపారు డెక్కన్ గ్రెయింజ్ ఇండియా డైరెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ పోలా.
US యుఎస్ మార్కెట్లో నంబర్ వన్!
డెక్కన్ ఫుడ్స్ ప్రస్తుతం యుఎస్ మార్కెట్లో నాన్-బాస్మతి రైస్ విభాగంలో నంబర్ వన్ బ్రాండ్గా కొనసాగుతోంది. సోనా మసూరి బియ్యం కంపెనీ అమ్మకాలలో 60% వాటాను కలిగి ఉండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని వేలాది మంది రైతుల నుంచి నాణ్యమైన బియ్యంను కొనుగోలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు.
సాంకేతికతతో నిండిన ప్రాసెసింగ్ ప్లాంట్
హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద, అత్యాధునిక జపాన్ సాంకేతికత ఆధారంగా నెలకు 5,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రైస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్లాంట్‌లో 100 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.
“ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ మేమైతే రచ్చ గెలిచాక ఇంటి గెలుపు వైపు అడుగులు వేస్తున్నాం,” అని చెప్పిన కిరణ్ కుమార్ గారి మాటల్లో – 2026 ప్రారంభంలో డెక్కన్ గ్రెయింజ్ దేశీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది.
15 ఏళ్ల విజయగాథ తర్వాత, భారతీయ వినియోగదారులకు డెక్కన్ రైస్‌ను పరిచయం చేయడం ప్రత్యేక క్షణంగా నిలవనుంది.













