ఐస్ క్రీమ్ లవర్స్.. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న హై బిజ్ టీవీ ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ మళ్లీ వచ్చేస్తోంది. ఏప్రిల్ 27న ప్రోగ్రాం జరుగబోతోంది. ఈ నేపథ్యంలో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్ వేదికగా దీన్ని చేపట్టారు. హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్, బిగ్ బాస్ ఫేమ్ శ్వేత వర్మ, యాక్టర్ సమీర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వారితో పాటు సుహాస్ బి. శెట్టి (ఫౌండర్ & సీఈవో, ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్ బర్గ్ ఐస్ క్రీమ్స్), కేవీ నాగేంద్ర ప్రసాద్ (లీజింగ్ & అడ్వర్టైజింగ్ బిజినెస్ హెడ్ – ఎల్ & టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్), ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ను హై బిజ్ టీవీ గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..! ఈ సారి జరుగబోయేది 3వ ఎడిషన్. ఇందులో పాల్గొని.. కళ్లకు గంతలు కట్టుకుని ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి దాని ఫ్లేవర్ చెప్పాల్సి ఉంటుంది. అలా ఎవరు ఎక్కువగా గెస్ చేస్తే వాళ్లే విజేతలుగా నిలుస్తారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు. సెకండ్ ప్లేస్ లో నిలిస్తే 50 వేలు దక్కుతాయి. 3వ బహుమతిగా 25 వేలు అందిస్తారు. అలాగే 25 మంది లక్కీ డ్రా విన్నర్స్ ను కూడా ఎంపిక చేస్తారు.






ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ కు ఐస్ బర్గ్ ఐసీ క్రీమ్స్ ఆధ్వర్యంలోని ఆర్గానిక్ క్రీమరీ సహకారాన్ని అందిస్తోంది. ఏప్రిల్ 27న ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్ లో ఈ కాంపిటీషన్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పోటీలో పాల్గొనే వాళ్లు 250 రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందులో 100 రూపాయల విలువచేసే ఐస్ క్రీమ్ వోచర్ ను రీడిమ్ చేసుకోవచ్చు.
ఇక, కర్టెన్ రైజర్ లో భాగంగా హాజరైన గెస్ట్ లు కళ్లకు గంతలు కట్టుకుని.. ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి.. ఫ్లేవర్ ఏంటో చెప్పారు. అక్కడున్న వారిని ఇదెంతగానో ఆకట్టుకుంది. మరి మీరు కూడా ఏప్రిల్ 27న జరిగే ది గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ లో పాల్గొనాలనుంటే వెంటనే online లో రిజిస్టర్ అవండి.