హై బిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీ, ఈ & సీ, పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రకాల వ్యాపారాల్లో రాణిస్తున్న సంస్థలు, వ్యక్తులకు హై బిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డులను అందజేశారు. 60కి పైగా పురస్కారాలు అందులో ఉన్నాయి.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ వైస్ చైర్మన్ & ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ లయన్ వై కిరణ్ (హానరరీ కాన్సుల్ ఆఫ్ బల్గేరియా & సీఈవో – సుచిరిండియా గ్రూప్), రవీందర్ రెడ్డి (మార్కెటింగ్ డైరెక్టర్ – భారతి సిమెంట్), వేణు వినోద్ (మేనేజింగ్ డైరెక్టర్ – సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్), ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాణిజ్యం, వ్యాపారం లేకుండా.. ప్రభుత్వాలు, వ్యవస్థలు నడువలేవని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అలాంటి కీలక రంగాల్లో అమూల్యమైన సేవలు అందించిన వారిని హై బిజ్ టీవీ గుర్తించి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. దీన్నొక మంచి ప్రయత్నంగా అభివర్ణించారు. ఇందుకోసం కృషి చేస్తున్న హై బిజ్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం.. వ్యాపార రంగాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్ర ప్రగతికి యువ నాయకత్వం కృషి చేస్తోందని తెలిపారు. 2023లో తెలంగాణ అభివృద్ధి 2Xగా ఉంటే.. రాబోయే నాలుగేళ్లలో దాన్ని 10Xకు చేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని హామీ ఇచ్చారు. ఇక, తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో 1.7 లక్షల కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్ ను మన రాష్ట్రం సాధించడమే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు.
పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. అలాంటి వారిని హై బిజ్ టీవీ ప్రోత్సహించి.. అవార్డులతో సత్కరించడం గొప్ప విషయమని ప్రశంసించారు. పారిశ్రామిక రంగాభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
హై బిజ్ టీవీ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో భాగంగా 11 మందికి లెజెండ్ పురస్కారాలను అందజేశారు. అలాగే సీఎస్ఆర్ కేటగిరీలో ఉత్తమ గ్రూప్ గా ఐటీసీకి అవార్డు దక్కింది. దీనిపై పురస్కార గ్రహీతలు సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న వారిని గుర్తించి హై బిజ్ టీవీ ఇలా సత్కరించడం సంతోషకరమని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
![](https://hybiz.tv/wp-content/uploads/2025/02/1G5A2501-1-1024x683.webp)
![](https://hybiz.tv/wp-content/uploads/2025/02/1G5A2501-1-1024x683.webp)
![](https://hybiz.tv/wp-content/uploads/2025/02/230A0753-1024x683.webp)
![](https://hybiz.tv/wp-content/uploads/2025/02/230A0753-1024x683.webp)
![](https://hybiz.tv/wp-content/uploads/2025/02/230A0762-1024x683.webp)
![](https://hybiz.tv/wp-content/uploads/2025/02/230A0762-1024x683.webp)
![](https://hybiz.tv/wp-content/uploads/2025/02/230A1003-1024x683.webp)
![](https://hybiz.tv/wp-content/uploads/2025/02/230A1003-1024x683.webp)