73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
డాక్టర్ బి. పార్థసారథి రెడ్డి (ఐ.పి.సి.ఎ ప్రెసిడెంట్), టి.వి. నారాయణ (ఐ.పి.ఎ ప్రెసిడెంట్), డాక్టర్ ఎ. రామ్ కిషన్ (ఎల్ ఓసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ), డాక్టర్ జె.ఎ.ఎస్ గిరి (ఎల్ ఓసీ ఛైర్మన్)ల ఆధ్వర్యంలో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ జరుగుతుంది.
గ్లోబల్ లీడర్స్, ప్రిక్స్ గేలియన్ అవార్డు గ్రహీతలు, టాప్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీల సీఈవోలు, 8 వేల నుంచి 10 వేల మంది ఫార్మాస్యూటికల్ ప్రొఫెషనల్స్ ఈ సదస్సులో పాల్గొంటారు.
73rd Indian Pharmaceutical Congress కు సంబంధించిన వివరాలను ఐ.పి.సి.ఎ ప్రెసిడెంట్ డాక్టర్ బి. పార్థసారథి రెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఫార్మాస్యూటికల్ పరిశోధన, అభివృద్ధిలో తాజా పురోగతిపై దృష్టి సారించే విభిన్న సెషన్ లు ఇందులో ఉంటాయని చెప్పారు. అలాగే ఇన్నోవేటర్స్ ఒడిస్సీ – ఛాలెంజ్ ల ద్వారా మార్గాలను రూపొందించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం..
పరిశోధన ప్రణాళిక, గణాంక విశ్లేషణ, ఎథిక్స్ & విజయవంతమైన ప్రచురణ.. స్వయం సాధికారత కోసం మహిళల చొరవ వంటి థీమ్స్ పై ఐ.పి.సి ఈ సారి దృష్టి సారించిందని తెలిపారు. నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకునేందుకు.. సహకారాన్ని పెంపొందించేందుకు.. ఇదొక చక్కని వేదిక అని ఆయన వివరించారు.
సదస్సులో భాగంగా సీఈఓ కాంక్లేవ్, ప్లేస్ మెంట్ కాంక్లేవ్ నిర్వహిస్తారు. ఇండస్ట్రీ లీడర్స్ & ప్రొఫెషనల్స్ మధ్య… ఔషధ పరిశోధన, అభివృద్ధిలో పరస్పర సహకారానికి, కొత్త అవకాశాల అన్వేషణకు ఇది ఉపయోగపడుతుంది.
అలాగే ఇన్వెస్ట్ ఇండియా అనే అంశంపై ఫార్మారంగ ప్రముఖుల ప్రసంగాలు కూడా ఉంటాయి. అటు, ఇండస్ట్రీ ఎక్స్ పోను కూడా ఏర్పాటు చేస్తారు. ఫార్మాస్యూటికల్ తయారీ రంగంలో లేటెస్ట్ ఫార్ములేషన్స్, టెక్నాలజీలను తెల్సుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.