5G Spectrum Auction: మొబైల్ రేడియో తరంగ సేవల కోసం కేంద్రం నిర్వహించిన 5G Spectrum వేలం ముగిసింది. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు Auction జరిగింది. ఈ సారి రూ. 96,238 కోట్ల విలువైన 10 Gigahertz స్పెక్ట్రమ్ ను కేంద్రం వేలానికి ఉంచింది. తొలిరోజు ఐదు రౌండ్ల బిడ్డింగ్ లో రూ. 11,340 విలువైన బిడ్స్ ను టెలికాం సంస్థలు సమర్పించాయి. రెండో రోజు ఎలాంటి బిడ్లు రాలేదు. దీంతో వేలం ముగిసినట్టు ప్రకటించారు. Bharati Airtel, Jio, VodafoneIdea ఈ వేలంలో పాల్గొన్నాయి. వాటిలో Bharti Airtel టాప్ బిడ్డర్ గా నిలిచినట్టు తెలుస్తోంది. 900 MHz, 1800 MHz, and 2100 MHz బ్యాండ్లను అది దక్కించుకునే అవకాశముంది. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఇండియా.. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచినట్టు సమాచారం.
USB-C Type Charging Port: మన దేశంలో స్టార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ లు వాడేవాళ్లు రకరకాల ఛార్జింగ్ పోర్ట్స్ వాడుతుంటారు కదా..! టైప్ – బి, టైప్ – సి.. ఇలా అవి రకరకాలుగా ఉంటాయి. అయితే ఇకపై అలా డిఫరెంట్ పోర్ట్స్ వాడటం కుదరదు. కేంద్రం తీసుకురాబోతున్న కొత్త రూల్స్ ఇందుకు కారణం. వీటి ప్రకారం యు.ఎస్.బి టైప్ – సి చార్జింగ్ పోర్ట్ ఇకపై మన దేశ వ్యాప్తంగా Mandate కాబోతోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించే చర్యల్లో భాగంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రాబోతోంది. అయితే ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచీలు, హెడ్ ఫోన్లకు ఈ రూల్ వర్తించదు. వాటికి 2026 నుంచి USB-C Type Charging Portలను తప్పనిసరి చేసే అవకాశముంది.
Reliance Retail: Quick Commerce రంగంలోకి Reliance Retail అడుగుపెట్టింది. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను గంటలోపే డెలివరీ చేసే ఉద్దేశంతో ఈ సేలవను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ముంబై, నవీ ముంబైలో వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. రాబోయే రోజుల్లో ఇతర నగరాలకు విస్తరించే అవకాశముంది. Fast Moving Consumer Goodsలో భాగంగా Reliance Retail.. క్విక్ కామర్స్ సర్వీస్ మొదలుపెట్టింది. జియోమార్ట్ మొబైల్ అప్లికేషన్‌లో హైపర్ లోకల్ డెలివరీ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ పెట్టుకోవచ్చు.
Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా దూకుడు ప్రదర్శించాయి. ఒకవైపు ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్.. మరోవైపు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో లాభాలను గడించాయి. సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి రికార్డు స్థాయిలో ముగిశాయి. ఉదయం 78,094.02 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్ 620.73 పాయింట్లు లాభపడింది. చివరకు 78,674.25 దగ్గర క్లోజయింది. నిఫ్టీ 147.50 పాయింట్ల గెయిన్ తో 23,868 దగ్గర స్థిరపడింది. భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, మహీంద్ర, టాటా స్టీల్ వంటి షేర్లు ఇవాళ లాభపడ్డాయి.