Hybiz Food Awards 2024
Hybiz Food Awards 2024

హై బిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ 3వ ఎడిష‌న్ విజ‌య‌వంతంగా జ‌రిగింది. హైద‌రాబాద్ లోని హోట‌ల్ తాజ్ డెక్క‌న్ లో అట్ట‌హాసంగా ఈవెంట్ ను నిర్వ‌హించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. సినీ నటి ఫరియా అబ్దుల్లా, మిస్ యూనివ‌ర్స్ తెలంగాణ నిహారికా సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్ పాల్ ఇందులో పాల్గొని సంద‌డి చేశారు.

వీరితో పాటు ల‌య‌న్ డాక్ట‌ర్ వై. కిర‌ణ్ (హాన‌ర‌రీ కాన్సుల్, రిప‌బ్లిక్ ఆఫ్ బ‌ల్గేరియా ఫ‌ర్ తెలంగాణ & ఏపీ, సీఈవో & మేనేజింగ్ డైరెక్ట‌ర్ – సుచిరిండియా), పి. చంద్రశేఖ‌ర్ రెడ్డి (సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ & మార్కెటింగ్ – జెమిని ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్), భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పీవీ రావు (డిప్యూటీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ – మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్), మ‌ధుసూద‌న్ రావు (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – విమ‌ల ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్), మోహన్ శ్యామ్ ప్రసాద్ (మేనేజింగ్ డైరెక్టర్ – తెనాలి డబుల్ హార్స్), దుర్గా ప్ర‌సాద్ (డైరెక్ట‌ర్ – శ్రీ చ‌క్ర మిల్క్), ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – హైబిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్ట‌ర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) త‌దిత‌రులు హాజ‌రయ్యారు.

హోటల్ అంటే ఆదాయం ఇచ్చేది మాత్రమే కాదు.. ఆకలి కూడా తీర్చేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. నాణ్యమైన ముత్యాలకు, రుచికరమైన బిర్యానీకి హైదరాబాద్ ప్రసిద్ధి పొందిందని గుర్తు చేశారు. బిర్యానీతో పాటు తెలుగు వంటకాలు అందించే హోటళ్ళు ఇక్కడ వేల సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ మిని ఇండియా అని.. ఈ నగరంలో అన్ని ప్రాంతాల వారూ నివసిస్తారని తెలిపారు. కేవలం తెలుగు వంటకాలే కాకుండా.. ఇతర రాష్ట్రాల ఫుడ్ అందించే హోటళ్ళు, రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో విస్తరించడం వల్ల కాంటినెంటల్ ఫుడ్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఫుడ్ సర్వీస్ ఇండస్ట్రీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పిన స్పీకర్.. అందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు.

Poultary

హైదరాబాద్ అంటేనే ఒక ఎమోషన్ అని ఫరియా అబ్దుల్లా చెప్పారు. నగరవాసులు ఫుడ్ ను లవ్ చేస్తారని.. ఎంజాయ్ చేస్తారని తెలిపారు. హైదరాబాద్ లో ఫుడ్ మేకింగ్ అద్భుతంగా ఉంటుందని అలాగే బెస్ట్ సర్వీస్ అందిస్తారని పేర్కొన్నారు. తనకు కట్టీ దాల్ చావల్ ఫేవరెట్ ఫుడ్ అని ఫరియా తెలిపారు.

ఇక, 3వ ఎడిష‌న్ లో భాగంగా.. డాక్ట‌ర్ సుధాక‌ర్ రావు (కంట్రీ ఓవెన్ ఫౌండ‌ర్), స‌ద్ది వెంక‌ట రెడ్డి (వివేరా హోట‌ల్స్ ఛైర్మ‌న్)ల‌ను హైబిజ్ టీవీ లెజెండ్ అవార్డ్స్ తో స‌న్మానించింది. అలాగే ఫుడ్ ఇండ‌స్ట్రీలో వివిధ విభాగాల్లో 50కి పైగా పుర‌స్కారాల‌ను అంద‌జేసింది. హైదరాబాద్ ను ఫుడ్ గ్రాఫ్ లో అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్య‌క్తుల‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, జ్యూస్ ఔట్ లెట్లు, బేకరీలు, మండి మొద‌ల‌గు రంగాల్లో స‌ర్వీస్ అందిస్తున్న‌ బ్రాండ్ ల‌కు పుర‌స్కారాల‌ను ఇచ్చి గౌర‌వించింది.

హైబిజ్ టీవీ ఇప్ప‌టికే మీడియా, ఉమెన్ లీడర్ షిప్, హెల్త్ కేర్, రియ‌ల్టీ, ఎడ్యుకేష‌న్ అవార్డ్స్ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. వాటితో పాటు టీ ఛాంపియ‌న్ షిప్, ఐస్ ట్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ఈవెంట్స్ ను స‌క్సెస్ ఫుల్ గా చేపట్టింది. అలాగే ఆహార ప‌రిశ్ర‌మ‌లో ప్రొఫెష‌న‌ల్స్ కు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఫుడ్ అవార్డ్స్ ప్ర‌దానం చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే రెండు ఎడిష‌న్స్ ను దిగ్విజ‌యంగా పూర్తి చేసింది. 2024లో ఈ సారి మూడో ఎడిష‌న్ ను కూడా స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించింది.

హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల కోసం….. నంబ‌ర్ లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here