ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా జ‌ల‌మండ‌లి నిర్మిస్తున్న ఖాజాకుంట ఎస్టీపీని ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ మ‌యాంక్ మిట్ట‌ల్ సంద‌ర్శించారు. ప్యాకేజ్-3 లో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ సామ‌ర్థ్యం 20 ఎంఎల్డీలు.

 ఈ సంద‌ర్భంగా ఈడీ ఎస్టీపీ నిర్మాణ ప‌నులు ప‌రిశీలించారు. అధికారుల‌తో మాట్లాడి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉన్న ప‌నులను వేగ‌వంతం చేయాల‌ని ఈడీ అన్నారు. ఎస్టీపీ ప్రాంగ‌ణంలో అంత‌ర్గ‌త రోడ్లు, లైటింగ్, సుందరీక‌ర‌ణ ప‌నులు చేపట్టాల‌ని సూచించారు. కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు అడ్మిన్ బిల్టింగ్, స్టాఫ్ క్వార్ట‌ర్స్ నిర్మించాల‌ని పేర్కొన్నారు.

 ఈ కార్య‌క్ర‌మంలో ఎస్టీపీ సీజీఎం ప‌ద్మ‌జ‌, డీజీఎం, మేనేజ‌ర్, నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Poultary
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here