సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిహెచ్ఎంసి వ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతున్నది నేటికీ 62.47 శాతం కుటుంబాల సర్వే పూర్తి చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు మరియు కుల సర్వే అందరి సమన్వయంతో ముమ్మరంగా సాగుతున్నది.
ఎన్యుమరేటర్లు నింపిన ఫారాలను ట్రంక్ బాక్స్ లో రోజు వారీగా నిర్దేశించిన ప్రకారం స్ట్రాంగ్ రూం లో భద్ర పరుస్తున్నారు. గ్రేటర్ లో సర్వే ను సకాలంలో పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకో నైనది. ఎన్యుమరేటర్లకు కేటాయించిన బ్లాక్ లో సామాజిక సర్వే పూర్తయిన తర్వాత డేటా ఎంట్రీ స్టార్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ కోసం ఏజెన్సీ గుర్తించిన నేపథ్యంలో సర్కిల్ వారీగా ఎంత మంది కంప్యూటర్ ఆపరేటర్లు అవసరం ఉంటుంది. డిప్యూటీ కమిషనర్లు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ లో సర్వే విజయవంతంగా సాగుతున్నది. రోజు రోజుకు ఎన్యుమరేటర్ లు ఇంటింటి సర్వే ఎక్కువ సంఖ్యలో చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సర్వే వివరాలు సక్రమంగా కోడింగ్ చేసేందుకు సూపర్వైజర్లు తరచుగా పరిశీలించాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో నేటికీ 1,25,593 కుటుంబాలు సర్వే చేయగా, ఇప్పటి వరకు మొత్తం 15,17,410 కుటుంబాల సర్వే పూర్తి తో 62.47 శాతం సర్వే పూర్తయింది.