విద్యా రంగాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న వ్య‌క్తులు, సంస్థ‌ల‌కు హై బిజ్ టీవీ స‌ముచిత గౌర‌వాన్ని క‌ల్పించింది. ఎడ్యుకేష‌న్ ఎక్స్ లెన్స్ అవార్డుల‌తో ఘ‌నంగా స‌త్క‌రించింది. హై బిజ్ టీవీ వ‌రుస‌గా రెండో ఏడాది ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం విశేషం. హైద‌రాబాద్ హెచ్.ఐ.సి.సి వేదిక‌గా అట్ట‌హాసంగా ఈ వేడుక జ‌రిగింది.

శాంతా బ‌యోటెక్ ఎం.డి వ‌ర‌ప్ర‌సాద్ రెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఎం. రాధా రెడ్డి (డైరెక్టర్ – స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్),బి.వి.ఆర్ మోహ‌న్ రెడ్డి (ఫౌండ‌ర్ & ఛైర్మ‌న్ – సైయెంట్ గ్రూప్ & ఫౌండేష‌న్), డాక్ట‌ర్ సి.హెచ్ ప్రీతి రెడ్డి (వైస్ ఛైర్ ప‌ర్స‌న్ – మ‌ల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్), డాక్ట‌ర్ బూర న‌ర్స‌య్య గౌడ్ (మాజీ ఎంపీ – భువ‌న‌గిరి), చిలప్పగారి విజయ (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – విజ‌య‌క్రాంతి, మెట్రో ఇండియా & ఇంట‌ర్ కాంటినెంట‌ర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్), ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్ట‌ర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్ట‌ర్ – హై బిజ్ టీవీ ఎల్.ఎల్.పి) త‌దిత‌రులు పాల్గొన్నారు.

విద్యా రంగంలో వ్యక్తులు, సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించి ఇలాంటి అవార్డులు ఇవ్వడం గొప్ప విషయమని శాంతా బ‌యోటెక్ ఎం.డి వ‌ర‌ప్ర‌సాద్ రెడ్డి కొనియాడారు. మన సంస్కృతిలో దేవాలయాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో.. విద్యాలయాలకు కూడా అంతటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. చదువు-సంస్కృతి అనేవి కవల పిల్లల్లాంటివని చెప్పారు. ఈ రెండింటికీ తగిన ప్రాముఖ్యత ఇస్తేనే అది నిజమైన విద్య అవుతుందని తెలిపారు. తల్లి ఒడిని తొలి బడిగా వ‌ర‌ప్ర‌సాద్ రెడ్డి అభివర్ణించారు. ఇక, పౌర సమాజాన్ని తయారు చేయడంలో గురువులు కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. చదువుతో పాటు సంస్కారం నేర్పించి.. సమాజం పట్ల అవగాహన కల్పించి.. విద్యార్ధులను సమగ్రమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యతను వాళ్లు తీసుకుంటారని తెలిపారు. లక్ష్య సాధనలో విద్యార్థులు ఎప్పుడూ వెనకడుగు వేయకూడదని సూచించారు.

Poultary

హై బిజ్ టీవీ ఎడ్యుకేష‌న్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో భాగంగా 60కి పైగా పుర‌స్కారాల‌ను అంద‌జేశారు. తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి విజేత‌లు ఈ అవార్డుల‌ను స్వీక‌రించ‌డం మ‌రో విశేషం. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఉత్తమ ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసి ఎడ్యుకేష‌న్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ను ఇచ్చారు.

దీనిపై కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ముఖులు సంతోషం వ్య‌క్తం చేశారు. నాణ్య‌మైన‌ విద్య అందిస్తూ విద్యార్థుల భ‌విష్య‌త్ కు బంగారు బాట‌లు వేస్తున్న వ్య‌క్తులు, సంస్థ‌ల‌ను గుర్తించి.. వారిని స‌న్మానించ‌డం చెప్పుకోద‌గ్గ‌ విష‌య‌మ‌ని కొనియాడారు. ఇలాంటి గొప్ప‌ ఆలోచ‌న చేసిన హై బిజ్ టీవీని అభినందించారు. ఈ ఛాన‌ల్ ఆధ్వ‌ర్యంలో రాబోయే రోజుల్లో మ‌రెన్నో కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here