భార‌త్ లో Meta AI .. Tech Roundup
భార‌త్ లో Meta AI .. Tech Roundup

భార‌త్ లో Meta AI:

భార‌త్ లో WhatsApp, Facebook, Messenger, Instagram యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్. Tech giant Meta రూపొందించిన Artificial Intelligence Assistant Meta AI మ‌న దేశంలో అందుబాటులోకి వ‌చ్చింది. Social Media Appsలో ఛాటింగ్ తో పాటు కంటెంట్ క్రియేట్ చేసేందుకు దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆయా అంశాల‌పై లోతుగా శోధించేందుకు కూడా వాడొచ్చు. Large Language Model అయిన Llama 3 లేటెస్ట్ వ‌ర్ష‌న్ ఆధారంగా దీన్ని త‌యారు చేశారు. ఈ మెటా ఏఐని వాట్సాప్ గ్రూప్ ఛాట్స్ లో యూజ్ చేయొచ్చు. రెస్టారెంట్ల వివ‌రాలూ తెలుసుకోవ‌చ్చు. ఇలా యూజర్లకు అనేక‌ రకాలుగా ఏఐ అసిస్టెంట్ సేవ‌లు అందించ‌నుంది.

Meta AI
Meta AI

Bank Of Baroda:

ఐటీ ఉద్యోగుల పెంపుపై Bank of Baroda దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా In House Technology Teamను 3 వేల‌కు పెంచాల‌ని ప్లాన్ చేస్తోంది. ప్ర‌స్తుతం Bank Of Barodaలో 1500 మంది ఐటీ సిబ్బంది ప‌ని చేస్తున్నారు. రాబోయే రెండేళ్ల‌లో ఆ సంఖ్య రెట్టింపు కానుంది. రెగ్యుల‌ర్ హైరింగ్ తో పాటు specialist talent కేట‌గిరీ సిబ్బందిని ఇందులో Hire చేసుకోనున్నారు. Technology Architectureలో లోటుపాట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవ‌ల ఫైర్ అయిన నేప‌థ్యంలో ఆ విభాగాన్ని క‌ట్టుదిట్టం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఈ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

Bank Of Baroda
Bank Of Baroda

Vivo T3 Lite:

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వినో మ‌రో బ‌డ్జెట్ ఫోన్ ను లాంఛ్ చేయ‌బోతోంది. Vivo T3 Lite పేరుతో దీన్ని తీసుకురానుంది. ఈ నెల 27న ఈ మొబైల్ ఇండియ‌న్ మార్కెట్ లో రిలీజ్ కానుంది. Vivo T3 Lite.. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ చిప్ సెట్ తో పని చేస్తుంది. 50 మెగాపిక్సెల్ AI Main Rear Camera, Secondary కెమెరా ఇందులో అమ‌ర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. బ్లాక్, గ్రే క‌లర్స్ లో ఈ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చారు. దీని ధ‌ర రూ. 12 వేలు ఉంటుంద‌ని అంచ‌నా.

Poultary
Vivo T3 Lite
Vivo T3 Lite

Paytm:

Indian multinational financial technology company Paytm.. ట్రావెల్ ఇండ‌స్ట్రీలో బ‌లోపేతం కావ‌డంపై దృష్టి పెట్టింది. ఆ దిశ‌గా కీల‌క అడుగులు వేస్తోంది. ఇందుకుగానూ ట్రావెల్ అగ్రిగేట‌ర్స్ Skyscanner, GoogleFlights, Wegoతో జ‌త‌క‌ట్టింది. వాటితో పాటుగా Cambodia Angkor Air, SalamAir, FlyDubaiతో త్వ‌ర‌లో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. కాగా, పేటిఎం ద్వారా ఫ్లైట్ బుకింగ్స్ కొద్దిరోజులుగా గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. గ‌తంలో పోలిస్తే అవి 19 శాతం ఎక్కువ‌య్యాయి. ఈ ప‌రిస్థితుల్లో ఆ సంఖ్య‌ను మరింత పెంచేందుకు పేటీఎం ఈ చ‌ర్య‌లు తీసుకుంది.

Paytm
Paytm
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here