భార‌తీయ ఫార్మా ఎక్స్ పోర్ట్స్
భార‌తీయ ఫార్మా ఎక్స్ పోర్ట్స్

భార‌తీయ ఫార్మా ఎక్స్ పోర్ట్స్ గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తిని సాధించాయి. 2004-05లో ఫార్మాస్యూటికల్స్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) ఏర్పాట‌య్యే నాటికి అవి 3.9 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండేవి. 2023-24 నాటికి వాటి విలువ 27.85 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. 2005 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2024 ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ వ‌ర‌కు కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు 11 శాతం పెర‌గ‌డం విశేషం.

ఈ వివ‌రాల‌ను ఫార్మెక్సిల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ శ్రీ ఉద‌య భాస్క‌ర్.. మీడియాకు వెల్ల‌డించారు. భారతీయ ఫార్మా ఎగుమతులు- భవిష్యత్ అవకాశాలు & సవాళ్లపై హైద‌రాబాద్ లోని తాజ్ కృష్ణ‌ హోట‌ల్ లో జ‌రిగిన స‌మావేశంలో ఫార్మా ఎక్స్ పోర్ట్స్ వృద్ధిని ఆయ‌న వివ‌రించారు.

2017-18లో ఎక్స్ పోర్ట్స్ 17.3 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండేవి. 2030 నాటికి అవి 55 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరే అవ‌కాశ‌ముంది. ఎగుమ‌తులు ఇంత‌లా పెర‌గ‌డం వెనుక ఫార్మెక్సిల్ కృషి ఎంత‌గానో దాగుంది.

Poultary

కోవిడ్-19 మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన స‌మ‌యంలో భార‌త్ స్వ‌దేశీ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. దాన్ని 100 క‌న్నా ఎక్కువ‌ దేశాల‌కు స‌ర‌ఫ‌రా చేసి అండ‌గా నిలిచింది. దీనిద్వారా ఇండియా.. ప‌వ‌ర్ హౌజ్ ఆఫ్ వ్యాక్సిన్స్ గా పేరు సంపాదించింది.

మీడియా స‌మావేశానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు:

  • 2022-23లో 25.4 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్న ఫార్మా ఎక్స్ పోర్ట్స్.. 2023-24 నాటికి 9.66 శాతం వృద్ధితో 27.85 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరాయి.
  • బ‌ల్క్ డ్ర‌గ్స్, డ్ర‌గ్ ఇంట‌ర్మీడియ‌ట్స్ 2023-24 ఏప్రిల్-మార్చిలో 1.60 శాతం వృద్ధిని సాధించాయి.
  • వ్యాక్సిన్ల‌ ఎగుమ‌తులు 1187.99 మిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నాయి.
  • దిగుమ‌తుల విష‌యానికొస్తే 1.98 శాతం పెరిగాయి. 2022తో పోలిస్తే ఇది త‌క్కువే.

iPHEX 10వ ఎడిష‌న్..:

భార‌తీయ ఫార్మా ఎక్స్ ఆధ్వ‌ర్యంలో 10వ ఎడిష‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫార్మా ఎగ్జిబిష‌న్ జ‌రుగ‌నుంది. ఈ ఏడాది ఆగ‌స్ట్ 28 నుంచి 30 వ‌ర‌కు గ్రేట‌ర్ నోయిడాలోని ఐఈఎంఎల్ లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. కేంద్ర‌ వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీనికి స‌హ‌కారాన్ని అందిస్తోంది. భార‌త్ నుంచి 440 ఎక్స్ పోర్ట‌ర్స్ పాల్గొని వారి ప్రొడ‌క్ట్స్ ను ప్ర‌ద‌ర్శిస్తారు. 120 దేశాల నుంచి 500 మంది ఓవ‌ర్సీస్ బిజినెస్ డెలిగేట్స్ ఇందులో పాల్గొంటారు. అలాగే 10 వేల మందికి పైగా విజిట‌ర్స్ ఈ ఎగ్జిబిష‌న్ ను వీక్షించే అవ‌కాశ‌ముంది.

ఫార్మెక్సిల్ గురించి..:

2004లో ఫార్మెక్సిల్ ప్రారంభ‌మైంది. ఫారెన్ ట్రేడ్ పాల‌సీలో భాగంగా కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వ‌ర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌పంచానికి ఔష‌ధాలు, అనుబంధ ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హించడం.. అందుకు అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని అందించ‌డం ఫార్మెక్సిల్ ముఖ్య ఉద్దేశం

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here