బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్
బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్

హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, ఏఐజి హాస్పిటల్స్‌లో తమ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్‌ను ప్రారంభించింది. ఏషియన్ మెడికల్ ఫౌండేషన్, యుసి బ్రెస్ట్ ఫౌండేషన్ మరియు ఏఐజి హాస్పిటల్స్ భాగస్వామ్యంతో గ్రాన్యూల్స్ ట్రస్ట్ నేతృత్వంలోని ఈ కార్యక్రమం , వెనుకబడిన కమ్యూనిటీలలో క్యాన్సర్ గుర్తింపు మరియు చికిత్సను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

అత్యాధునిక మొబైల్ యూనిట్ “బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్”, అవసరమైన కమ్యూనిటీలకు నేరుగా అధునాతన వైద్య సాంకేతికతను తీసుకువస్తుంది. అత్యాధునిక మామోగ్రఫీ మరియు అల్ట్రాసౌండ్ సామర్థ్యాలు, అలాగే హిమోగ్లోబిన్, రక్త పోటు మరియు గ్లూకోజ్ లెవల్స్ వంటి అవసరమైన ఆరోగ్య పరీక్షల కోసం తగిన సౌకర్యాలను కలిగి ఉన్న ఈ మొబైల్ క్లినిక్ సమానమైన మరియు అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పరంగా అతి పెద్ద పురోగతిని సూచిస్తుంది. ఈ క్లిష్టమైన సేవలను అందించడం మరియు ఉచిత ఔషధ పంపిణీని చేయటం ద్వారా, ఈ కార్యక్రమం క్యాన్సర్ స్క్రీనింగ్‌లో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నిస్తుంది, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది.

సమాజ శ్రేయస్సు కోసం సంస్థ యొక్క దీర్ఘకాలిక లక్ష్యంను నొక్కిచెప్పిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు గ్రాన్యూల్స్ ట్రస్ట్ చైర్‌పర్సన్ శ్రీమతి ఉమా చిగురుపాటి మాట్లాడుతూ ” ఫార్మాస్యూటికల్స్‌కు మించిన ఆవిష్కరణలను చేయడం ద్వారా ప్రజారోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపాలనే గ్రాన్యూల్స్ ఇండియా యొక్క ప్రధాన సిద్దాంతాన్ని బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ప్రతిబింబిస్తుంది. ఈ ప్రారంభం క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ అంతరాలను పరిష్కరించడంలో మా నిబద్ధతకు నిదర్శనం, ప్రత్యేకించి పరిమితి అవకాశాలు ఉండే గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాము. వెనుకబడిన వర్గాల ప్రజలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను అందించడం ద్వారా మేము చాలా ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ అంతరాలను పూరించడం తో పాటుగా ఆరోగ్య సంరక్షణ అందరికీ చేరువలో ఉండాలనే మా నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తున్నాము” అని అన్నారు.

Poultary

ఏఐజి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి ఈ భాగస్వామ్యం యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతూ , “గ్రాన్యూల్స్ ట్రస్ట్, ఏషియన్ మెడికల్ ఫౌండేషన్, యుసి బ్రెస్ట్ ఫౌండేషన్ మరియు ఏఐజి హాస్పిటల్స్ మధ్య ఈ భాగస్వామ్యం , ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలు క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, సమస్యలను ఎలా సమర్థవంతంగా పరిష్కరించగలవు అనేదానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ముఖ్యమైన స్క్రీనింగ్ సేవలను గ్రామీణ ప్రాంత ప్రజలకు విస్తరించడంలో బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్ కీలక పాత్ర పోషించనుంది , అవసరమైన వారికి అవసరమైన క్యాన్సర్ గుర్తింపు పరీక్షలను చెరువు చేరేలా చేస్తుంది” అని అన్నారు.

ఏఐజి వద్ద కన్సల్టెంట్ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ మరియు యుసి బ్రెస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి మాట్లాడుతూ ఈ కార్యక్రమం చూపే పరివర్తన ప్రభావం గురించి వెల్లడించారు, ఆమె మాట్లాడుతూ ” ఆరోగ్య పరీక్షలకు మించి, రొమ్ము ఆరోగ్యంపై అవగాహనను బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్ పెంచుతుంది మరియు సాధారణ స్వీయ-పరీక్షల జ్ఞానంను సైతం మహిళలకు అందిస్తుంది. ఈ కార్యక్రమం మరియు యుసి బ్రెస్ట్ ఫౌండేషన్ యొక్క కొనసాగుతున్న ప్రయత్నాలు ద్వారా, ముందస్తుగా సమస్యను గుర్తించడాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. అదే సమయంలో మేము శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ వంటి క్లిష్టమైన చికిత్సలు అవసరమైన మహిళలకు ఆర్థిక సహాయం కూడా అందించనున్నాము ” అని అన్నారు.

అక్టోబరులో నిర్వహించబోయే బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసానికి అనుబంధంగా , బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్ రొమ్ము క్యాన్సర్ నివారణ మరియు ముందస్తుగా గుర్తించడంపై ప్రపంచ లక్ష్యం కు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ మొబైల్ యూనిట్ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది, రాబోయే నెలల్లో తెలంగాణలోని ఇతర జిల్లాలకు విస్తరించే యోచనలో ఉంది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here