Techno Paints Experience Centre
Techno Paints Experience Centre

పెయింట్స్‌ రంగంలో ఉన్న టెక్నో పెయింట్స్‌ హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను ప్రారంభించింది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని హైటెక్‌సిటీ హెచ్‌ఐసీసీకి సమీపంలో ఏర్పాటు చేసింది. అనుబంధ కంపెనీ రిచ్‌వేవ్స్‌ తయారు చేస్తున్న ఇటాలియన్‌, లగ్జరీ ఫినిషెస్‌ను ఇక్కడ ప్రదర్శిస్తారు. రామ్‌కీ గ్రూప్‌ చైర్మన్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సీఐఐ – ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి, క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ జి.రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ మాజీ చైర్మన్ సిహెచ్ రామచంద్రా రెడ్డి తదితరుల సమక్షంలో ఈ సెంటర్‌ బుధవారం ప్రారంభమైంది. రిచ్‌వేవ్స్‌ బ్రాండ్‌లో 200లకుపైగా వెరైటీలను ఆఫర్‌ చేస్తున్నట్టు టెక్నో పెయింట్స్‌ సీఎండీ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి మీడియాకు తెలిపారు. సంస్థ ఆర్‌అండ్‌డీ, తయారీ సామర్థ్యానికి రిచ్‌వేవ్స్‌ నిదర్శనం అని అన్నారు.

అన్ని మెట్రో నగరాల్లో..
ఇంత విస్త్తృత స్థాయిలో ఇటాలియన్‌, లగ్జరీ ఫినిషెస్‌ తయారు చేస్తున్న ఏకైక భారతీయ కంపెనీ తామేనని శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. ఈ విభాగంలో ఉన్న కంపెనీలు ఫినిష్డ్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయిస్తున్నాయని గుర్తు చేశారు. వీటి తయారీకై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ప్రత్యేకంగా ప్లాంటు ఏర్పాటు చేశామన్నారు. సొంతంగా తయారు చేయడంతో నాణ్యతలో రాజీ పడకుండా ఈ ఉత్పత్తులను అందుబాటు ధరకు విక్రయిస్తున్నామని అన్నారు. బలమైన ఆర్‌అండ్‌డీ, నిపుణులైన పెయింటర్స్‌ కంపెనీ బలం అని వివరించారు. అన్ని మెట్రో నగరాల్లో ఇటువంటి ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్స్‌ను ఏడాదిలోగా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

వినియోగం 100 శాతం వృద్ధి..
ఇటాలియన్‌, లగ్జరీ ఫినిషెస్‌కు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. భారత పెయింట్స్‌ రంగంలో వీటి వాటా 0.5 శాతం లోపే. కానీ వినియోగం 100 శాతం వృద్ధి చెందిందని శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ‘మార్కెట్లో ఎన్ని రకాలు వచ్చినా ఇటాలియన్‌, లగ్జరీ ఫినిషెస్‌కు ఆదరణ తగ్గలేదు. గోడలు, ఫ్లోరింగ్‌ అందంగా ఉండేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. హై ఎండ్‌ విల్లాస్‌, బంగ్లా, క్లబ్‌ హౌజ్‌, షోరూమ్స్‌, పబ్స్‌, హోటళ్లలో ఈ ఫినిషెస్‌ వాడుతున్నారు. కస్టమర్‌ కోరితే కస్టమైజ్డ్‌ షినిషెస్‌ అందిస్తాం. అన్ని ఉత్పత్తులూ పర్యావరణానికి అనుకూలం. ఎటువంటి హాని చేయవు. సహజ సిద్ధంగా లభించే ఇసుక, సున్నపు రాయితో తయారు చేస్తున్నాం. దశాబ్దాలపాటు మన్నికగా ఉంటాయి’ అని తెలిపారు.

Poultary
Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here