మన దేశంలోనే అతిపెద్ద సిరామిక్ & విట్రిఫైడ్ టైల్ తయారీదారుగా పేరున్న కజారియా మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ లో అతిపెద్ద ఎటర్నిటీ & కెరోవిట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమానికి రిషీ కజారియా (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ – కజారియా సిరామిక్స్ లిమిటెడ్ & మేనేజింగ్ డైరెక్టర్ కజారియా బాత్‌వేర్ ప్రై. లిమిటెడ్) హాజరై ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కజారియా తయారు చేసే ప్రత్యేకమైన టైల్, బాత్, శానిటరీవేర్ కలెక్షన్ ను ప్రతీ కుటుంబానికీ అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌లో నెలకొల్పిన ఈ మెగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను.. నానాటికీ విస్తరిస్తున్న వారి నెట్ వర్క్ కు మరో మైలురాయిగా అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా వరల్డ్ క్లాస్ డిస్ ప్లేస్ ను అందుబాటులోకి తేవాలనే కజారియా ఆలోచనకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పారు.ఎటర్నిటీ & కెరోవిట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ స్పెషాలిటీస్ ను గమనిస్తే..


15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. విస్తృతమైన కజారియా ఎటర్నిటీ టైల్స్, మన దేశంలోనే నంబర్ 1 GVT బ్రాండ్ & ప్రీమియం కెరోవిట్ బాత్‌వేర్ ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక, ఈ సెంటర్ ను రెండు జోన్లుగా విభజించారు. అందులో ఒకటి కజారియా లేటెస్ట్ గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ కోసం కేటాయించారు. ఇంకొకటి కెరోవిట్ హై క్వాలిటీ బాత్ వేర్ సొల్యూషన్స్ కోసం అందుబాటులో ఉంచారు. దీంట్లో క్రోమ్ ఫినిష్డ్ కుళాయిలు, బేసిన్లు, బాత్రూం ఫిట్టింగ్ ల శ్రేణుల ప్రత్యేకమైన ఆరమ్ కలెక్షన్స్ కనిపిస్తాయి.
వీటితో పాటు అల్టిమా రేంజ్ లార్జ్ ఫార్మాట్ విట్రిఫైడ్ శ్లాబ్‌లు (1200×2400 ఎం.ఎం వరకు), యునిటెర్రా ప్రొడక్ట్ రేంజ్, అధునాతన శానిటరీవేర్ సొల్యూషన్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు కటింగ్ ఎడ్జ్ డిజైన్లు, టెక్నాలజీలను ఒకే చోట పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
కజారియా కొత్త ఎటర్నిటీ & కెరోవిట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కేవలం ప్రొడక్ట్ డిస్ ప్లే కోసమే కాకుండా రిసోర్స్ సెంటర్ గా కూడా పని చేస్తుంది. ఇండస్ట్రీ నిపుణులు ఇక్కడ కస్టమర్లకు కావాల్సిన గైడెన్స్ ఇస్తారు. వారి ఇళ్లకు సరైన ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకునేలా మార్గనిర్దేశం చేస్తారు. వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
కజారియా గురించి:
36 ఏళ్లకు పైగా ఇండస్ట్రీ లీడర్ షిప్ ఈ సంస్థ సొంతం. నాణ్యతకు, సేవకు, ఆవిష్కరణలకు ఇది పర్యాయపదం. భారతదేశ నంబర్ 1 టైల్ బ్రాండ్ గా కజారియా ముద్రవేసుకుంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 93.10 మిలియన్ చదరపు మీటర్లు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్, రోబోటిక్ ఆటోమేషన్ & జీరో-ఎర్రర్ టెక్నాలజీ కజారియా ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఈ సంస్థ వరుసగా 13 ఏళ్లు సూపర్ బ్రాండ్ గా గుర్తింపు దక్కించుకోవడం మరో విశేషం. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ప్రొడక్ట్ రేంజ్ ను కజారియా విస్తరిస్తూ వస్తోంది.
కెరోవిట్ గురించి:
2014లో ఈ సంస్థ ప్రారంభమైంది. 60% వరకు నీటిని సంరక్షించే పర్యావరణ అనుకూల సాంకేతికతలను మేళవింపుతో.. డిజైన్, పనితీరును సజావుగా మిళితం చేసే వివిధ రకాల శానిటరీవేర్, బాత్ సొల్యూషన్స్ ను ఇది అందిస్తోంది. రాజస్థాన్ లోని గైల్ పూర్, గుజరాత్ లోని మోర్బిలో కెరోవిట్ ప్రొడక్ట్స్ మాన్యుఫాక్చర్ అవుతాయి. ఇందులో మోర్బి ప్లాంట్.. ఇండియాలోనే సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన వాటిలో ఒకటిగా పేరు పొందింది. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని ఏర్పాటు చేశారు.



















