SLG Hospital
SLG Hospital

ప్ర‌పంచ గుండె దినోత్స‌వం సందర్భంగా ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో 5కె రన్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ దండు శివరామరాజు ప్రారంభించి, ప్రజలు తమ గుండె ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన ఆహారం, ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు నడవడం వంటి అలవాట్లు గుండెను కాపాడుకోవడానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఈ 5కె రన్‌లో కూకట్‌పల్లి, నిజాంపేట, బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి దాదాపు 400 మందికి పైగా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప‌రుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆస్పత్రి వారు అల్పాహారం అందించి, ఉత్సాహభరితంగా ముగించారు. రన్ పూర్తయ్యాక, ఆస్పత్రి వైద్య నిపుణుల ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) మరియు కార్డియోపల్మనరీ రీససిటేషన్ (CPR) శిక్షణను నిర్వహించారు, దీని ద్వారా కాలనీల ప్రజలు సీపీఆర్ ప్రాథమిక శిక్షణ పొందారు.

ఈ సందర్భంగా ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు మాట్లాడుతూ, ప్ర‌పంచ గుండె దినోత్స‌వం సందర్భంగా ప్రత్యేక హెల్త్ ప్యాకేజీలను ప్రకటించారు. ఈ ప్యాకేజీలు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి. ECG, 2D ఎకో, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ పరీక్షలతో కూడిన సాధారణంగా రూ. 2,999 విలువ చేసే ప్యాకేజీని కేవలం రూ. 799కే అందిస్తున్నారు. అలాగే, సాధారణంగా రూ. 13,999 విలువ చేసే యాంజియోగ్రామ్‌ను కేవలం రూ. 4,999కే అందిస్తున్నట్టు తెలిపారు.

Poultary

గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వ్యక్తులు, ఉదాహరణకు నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా శ్వాస ఆడకపోవడం, చెమట పట్టడం, గుండె వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవడం, గుండెల్లో మంట, దవడ, భుజం నొప్పి, కాళ్ల వాపు వంటి లక్షణాలు కనపడితే వెంటనే గుండె వైద్య నిపుణులను సంప్రదించాలంటూ ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్య నిపుణులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు, వారంతా 5కె రన్ మరియు సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here