వైద్య సేవల రంగంలో ప్రముఖ ఆసుపత్రిగా ప్రఖ్యాతిగాంచిన రెనోవా సెంచరీ హాస్పిటల్స్, అత్యాధునిక ఆర్థోపెడిక్స్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆర్థోపెడిక్స్ చికిత్స లేదా సంరక్షణలో భాగంగా, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, రెనోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆర్థోపెడిక్స్ & రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఉన్న రెనోవా సెంచురీ హాస్పిటల్‌లో ఈ కొత్త ఆర్థోపెడిక్స్ విభాగం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, I&PR శాఖల గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆర్థోపెడిక్స్ బ్లాక్‌ను ప్రారంభించారు. వైద్య నిపుణులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొదటి 100 రోబోటిక్‌ మోకాలి మార్పిడి ఆపరేషన్లు ఉచితం
రెనోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆర్థోపెడిక్స్ & రోబోటిక్ సర్జరీ విభాగం ప్రారంభోత్సవ ఆఫర్‌గా, మొదటి 100 రోబోటిక్‌ మోకాలి మార్పిడి ఆపరేషన్లను “ఉచితం”గా చేస్తామని రెనోవా సెంచరీ హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ ఉచిత పథకం కింద, రోబోతో చేసే ఆపరేషన్‌ ఖర్చును, మొత్తం ఆపరేషన్‌ ఖర్చు నుంచి రద్దు చేస్తామని తెలిపింది.

రోబోటిక్ సర్జరీ ప్రత్యేకతలు
అత్యంత ఖచ్చితత్వంతో మి.మీ. కంటే తక్కువ ఎముక కోత, తక్కువ నొప్పి, అత్యున్నత రోగి సంతృప్తి, అత్యంత వేగంగా కోలుకోవడం, అవయవం ఖచ్చితమైన పొడవు పునరుద్ధరణ, ఆసుపత్రిలో తక్కువ కాలం బస, 3D వర్చువల్‌ మోడల్‌ వంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Poultary

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తన తల్లి, అత్తగారికి రెనోవా ఆసుపత్రిలోనే మోకీలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయని వెల్లడించారు. హైదరాబాద్‌ ప్రపంచ వైద్య సేవల కేంద్రంగా మారుతోందని, అత్యుత్తమ చికిత్సల కోసం విదేశీయులు సైతం ఇక్కడకు వస్తున్నారని మంత్రి చెప్పారు. వైద్య రంగానికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందన్న మంత్రి, ఆసుపత్రి యాజమాన్యాలు కూడా ఆ సహకారాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నాయని అభినందించారు. పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడంలో కాకుండా ప్రజా సేవపై ఎక్కువ దృష్టి పెట్టే సంస్థల్లో రెనోవా గ్రూప్‌ ఒకటని ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆసుపత్రి యాజమాన్యానికి మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎ.బి. సుహాస్ మసిలామణి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ మరియు రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ మాట్లాడుతూ రెనోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆర్థోపెడిక్స్ & రోబోటిక్ సర్జరీ విభాగంలో తనతో పాటు నలుగురు నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తామని, అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకొచ్చామని చెప్పిన డా. ఎ.బి. సుహాస్, మోకాలి మార్పిడికి సంబంధించి ఎలాంటి ఆపరేషన్‌ను అయినా ఇది చేయగలదని వివరించారు. ఆర్థోపెడిక్స్ సంబంధించిన ఏ సమస్యకైనా తాము పరిష్కారం చూపగలమని, రోగులు పూర్తి స్వస్థతతో ఇంటికి తిరిగి వెళ్తారని భరోసా ఇచ్చారు.

ఆర్థోపెడిక్స్ చికిత్సల్లో మైలురాయి:
రెనోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆర్థోపెడిక్స్ & రోబోటిక్ సర్జరీ విభాగం అత్యాధునిక ఆర్థోపెడిక్స్ వైద్య సంరక్షణ సేవల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అత్యంత ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన శస్త్రచికిత్స నిపుణుల బృందం (డాక్టర్ ఎ.బి. సుహాస్ మసిలమణి; డాక్టర్ హిమకాంత్ లింగాల; డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, గుర్రం; డాక్టర్ సామా అనూప్ రెడ్డి) నేతృత్వంలో ఈ అత్యాధునిక విభాగం పని చేస్తుంది. చికిత్సలో అత్యంత కచ్చితత్వం, శ్రద్ధతో “ప్రతి అవసరానికి సంపూర్ణ ఆర్థోపెడిక్ చికిత్స” అందించడానికి ఈ కేంద్రం కట్టుబడి ఉంటుంది.

ఆర్థోపెడిక్స్ చికిత్సలో భాగంగా, జాయింట్ రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్సలో రోబోటిక్స్‌ను రెనోవా హాస్పిటల్స్‌ ప్రవేశపెట్టింది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన రోబోటిక్ వ్యవస్థలలో ఒకటి. ఇది సంపూర్ణ తుంటి (హిప్ రీప్లేస్మెంట్), మోకాలు మార్పిడి, పార్శ్వ మోకాలు మార్పిడి (పార్షియల్ నీ రీప్లేస్మెంట్), పటెల్లో ఫెమోరల్ రీప్లేస్‌మెంట్‌, సవరణ (రివిజన్) సర్జరీలు వంటి విస్తృత శ్రేణి శస్త్రచికిత్సలను నిర్వహించగలదు. ఈ రోబోట్, శస్త్రచికిత్స సమయంలో రోగి అనాటమీని పునఃసృష్టించగలదు. ఇది వ్యక్తిగత 3డీ శస్త్రచికిత్సా ప్రణాళికను అందించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వ్యవస్థ అక్కుస్టాప్ హాప్టిక్స్- కలిగిన రోబోటిక్ చేయి, ఎముక కోతలలో సబ్-మిల్లీమీటర్ కచ్చితత్వంతో సర్జరీ చేస్తుంది. ఈ సాంకేతికతలో త్వరగా నొప్పిని తగ్గించగల సామర్థ్యం, వేగంగా కోలుకునే సమయం, కార్యకలాపాలను త్వరగా తిరిగి ప్రారంభించడం, తక్కువకాలం ఆసుపత్రి బస వంటి అంశాలు కీలకం. ఈ టెక్నాలజీ స్థిరంగా, అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.

రెనోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆర్థోపెడిక్స్ & రోబోటిక్ సెంటర్‌, ఆర్థోపెడిక్స్ సర్జరీలను అత్యాధునిక సాంకేతికత & వ్యక్తిగతీకరించిన చికిత్సను అనుసంధానించడం ద్వారా వైద్యం అందించడంలో మరో ముందడుగు వేసింది. దీని ద్వారా రెనోవా సెంచరీ హాస్పిటల్స్ రోగి చికిత్స పట్ల తమకు గల అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. రెనోవా హాస్పిటల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా, అందరికీ అందుబాటులో ఉండే అధునాతన ఆరోగ్య సంరక్షణను అందించాలనే తన లక్ష్యాన్ని సాధించింది.

ఈ కార్యక్రమంలో శ్రీ రామసహాయం రఘురామ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, ఖమ్మం, శ్రీ బలరాం నాయక్, పార్లమెంట్ సభ్యులు, మహబూబాబాద్, శ్రీమతి యశస్విని రెడ్డి, శాసనసభ్యురాలు, పాలకుర్తి, శ్రీ.విజయ్ బాబు, తెలంగాణ ఐడీసీఎల్ ఛైర్మన్, డా. శ్రీధర్ పెద్దిరెడ్డి, ఎండీ & సీఈవో, రెనోవా హాస్పిటల్స్, డా.బి.కె.ఎస్.శాస్త్రి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, చైర్మన్ కార్డియాక్ సైన్సెస్, డా. జె.ఎం.కె.మూర్తి, చీఫ్ ఆఫ్ న్యూరాలజీ, డాక్టర్ హిమాకాంత్ లింగాల, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆంకోసర్జన్, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గుర్రం, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ & చీఫ్ ట్రామా సర్జన్, డాక్టర్ అనూప్ రెడ్డి సామ, కన్సల్టెంట్ షోల్డర్ మరియు స్పోర్ట్స్ సర్జన్, శ్రీ రవీంద్రనాథ్ గరగ, COO, రెనోవా గ్రూప్ అఫ్ హాస్పిటల్స్, శ్రీ కృష్ణ, HCOO, రెనోవా సెంచరీ హాస్పిటల్స్ లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here