ప్రపంచ కుబేరుల తాజా జాబితా విడుదలైంది. 2024కు సంబంధించి Hurun రిలీజ్ చేసిన ఈ లిస్ట్ లో చాలా మంది కొత్త వాళ్లకు చోటు దక్కింది. భారతీయ కుబేరుల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే Tesla, SpaceX అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద విలువ 231 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు.ఇండియాలో Mukesh Ambani.. వరల్డ్ లో Elon Musk
వరల్డ్ వైడ్ గా చూస్తే.. 185 బిలియన్ డాలర్ల నికర విలువతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో Jeff Bezos.. హురూన్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచారు.
3వ స్థానంలో LVMH CEO Bernard Arnault (175 బిలియన్ డాలర్లు), 4వ స్థానంలో Meta CEO Mark Zuckerberg (158 బిలియన్ డాలర్లు), 5వ స్థానంలో Oracle Chairman Larry Ellison (144 బిలియన్ డాలర్లు) నిలిచారు.
తొలి 100 మందిలో ఆరుగురికి చోటు:
తొలి వందమంది బిలియనీర్ల లిస్ట్ లో మన దేశం నుంచి కేవలం ఆరుగురికి మాత్రమే చోటు దక్కింది. ముఖేశ్ అంబానీతో పాటు గౌతమ్ అదానీ (అదానీ గ్రూప్ ఛైర్మన్), శివ్ నాడార్ (హెచ్ సీఎల్ ఛైర్మన్), సైరస్ పూనావాలా (సీరం ఇన్ స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్), కుమార మంగళం బిర్లా (ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్), రాధాకిషన్ దమాని (డీ-మార్క్) వారిలో ఉన్నారు.ఇండియాలో Mukesh Ambani.. వరల్డ్ లో Elon Musk
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. 115 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేశ్ అంబానీ 10వ స్థానాన్ని ఆక్రమించారు. 86 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ 15వ ప్లేస్ ను సొంతం చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు వీళ్లే..:
హురూన్ లిస్ట్ లో తెలుగు పారిశ్రామికవేత్తలకు చోటు దక్కింది.
వారిలో మురళి దివి & ఫ్యామిలీ (దివీస్ ల్యాబ్స్, 7 బిలియన్ డాలర్లు),
పి. పిచ్చిరెడ్డి (MEIL Group, 6 బిలియన్ డాలర్లు),
పి.వి. కృష్ణారెడ్డి (MEIL Group, 6 బిలియన్ డాలర్లు),
జూపల్లి రామేశ్వర్ రావు & ఫ్యామిలీ (మై హోం గ్రూప్, 4 బిలియన్ డాలర్లు) తదితరులు ఆ జాబితాలో ఉన్నారు.
- పి. వంశీకృష్ణ