ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త‌, శ్రీ కృష్ణ నామాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు కృషి చేసిన మ‌హానుభావులు, కృష్ణ భ‌గ‌వానుడికి ప్ర‌తిరూపంగా భావించే శ్రీ చైతన్య మహాప్రభువు 539వ ఆవిర్భావ తిథి అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. హైద‌రాబాద్ అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆల‌యం ఈ సంద‌ర్భంగా హ‌రే కృష్ణ నామ జ‌పంతో మార్మోగిపోయింది. దాదాపు 5 వేల మందికి పైగా భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా ఉద‌యం 7.30 గంట‌ల‌కు ద‌ర్శ‌న హార‌తి నిర్వ‌హించారు. 8 గంట‌ల నుంచి శ్రీ చైతన్య మహాప్రభు లీలలపై ఆధ్యాత్మిక ప్రవచనాలు జ‌రిగాయి. సాయంత్రం 5.30 గంట‌ల‌కు మ‌హా అభిషేకం, ఆరున్న‌ర‌కు చప్పన్ భోగ్ నైవేద్యం, 7 గంట‌ల‌కు గౌర హార‌తి ఇచ్చారు. 7.30 గంట‌ల నుంచి భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాద విత‌ర‌ణ చేప‌ట్టారు.

శ్రీ చైతన్య మహాప్రభువు , ప‌విత్ర భగవన్నామమైన హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే మంత్రాన్ని సామూహిక నామ సంకీర్తన ద్వారా వ్యాప్తి చేశారు .ప్ర‌స్తుత క‌లియుగంలో ఈ మంత్రం తారక మంత్రంగా శాస్త్రం చెబుతుంది. అందుకే ఇది మ‌హా మంత్రంగా ప్ర‌సిద్ధి పొందింది.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అత్తాపూర్‌లోని ఇస్కాన్ ఆలయం ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు నిల‌యంగా ప‌రిఢ‌విల్లుతోంది. వేలాది మందికి స్పూర్తిదాయ‌కంగా నిలుస్తోంది. 2021లో ఈ ఆల‌యం ప్రారంభ‌మైంది. శ్రీ శ్రీ రాధా మాధవ, శ్రీ శ్రీ గౌర నితాయి , శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రలకు ఇది నిలయం. ఇక్క‌డ‌ శ్రీ కృష్ణ జన్మాష్టమి, శ్రీ రాధాష్టమి, శ్రీ నరసింహ చతుర్దశి, శ్రీ వైకుంఠ ఏకాదశి, శ్రీ గౌర పూర్ణిమ, శ్రీ రామ నవమి వంటి అన్ని ప్రధాన వైష్ణవ పండుగలను భక్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుతారు.

Poultary

ఇక్క‌డ ప్ర‌తినిత్యం అన్న ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రుతుతుంది. 2 వేల మందికి పైగా భ‌క్తుల‌కు దీన్ని పంపిణీ చేస్తారు. దీంతో పాటు ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు. ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్య ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద మార్గదర్శకత్వంలో సేంద్రీయ వ్యవసాయ ప్రాజెక్టుల అభివృద్ధి, గో సంరక్షణ, భగవద్గీత, భాగవతం వంటి వేద పుస్తకాల పంపిణీ చేప‌డుతున్నారు. అలాగే, ప్రజలు సరళమైన, సంతోషకరమైన జీవితాన్ని గ‌డిపేందుకు అవ‌స‌ర‌మైన బోధ‌న‌ల‌ను చేస్తున్నారు. ల‌క్ష‌లాది మందిని ఆధ్యాత్మిక మార్గంలో న‌డిపించేందుకు అత్తాపూర్‌లోని ఇస్కాన్ ఆలయం వేదిక‌గా నిలుస్తోంది.

Bharati Cement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here